పెళ్లికి నిర్వచనం మారింది. ఇంతకు ముందు వరకట్న జాడ్యం భయంకరంగా ఉండింది..

పెళ్లికి నిర్వచనం మారింది. ఇంతకు ముందు వరకట్న జాడ్యం భయంకరంగా ఉండింది.. ఇప్పుడు లేదని కాదు కానీ అంత లేదు. పైగా అమ్మాయిలు దొరకడం లేదు. పెళ్లి కాని ప్రసాద్‌లే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అందుకే అబ్బాయిలు రాజీ పడుతున్నారు. గొంతెమ్మ కోరికలను గొంతులోనే దాచుకుంటున్నారు. ఇప్పుడీ సంగతులన్నీ ఎందుకంటే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఓ పోస్టే కారణం. ఆ పోస్టు పెద్ద చర్చకు దారి తీసింది. తనకు వరుడు కావాలంటూ ఓ మహిళ పెట్టిన పోస్టు అది! అయితే అందులో కండిషన్స్ అప్లై రాసుకొచ్చింది. ఆ కండీషన్లు చూస్తే సొమ్మసిల్లి పడిపోవడం గ్యారంటీ. ఆమెను కట్టుకోబోయే వ్యక్తికి ఏడాదికి 30 లక్షల రూపాయల జీతం ఉండాలట! అతగాడికి తల్లిదండ్రులు ఉండకూడదట! మినిమం ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఉండాలట! వరుడు కావాలని అంటూ ఓ పోస్ట్ చేసిన ఆమె ఎంఎ చదివింది. బీఈడీ కూడా చేసి ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. ఆమెకు ఏడాదికి 1.3 లక్షల జీతం వస్తుంది. ఆమెకు ఇంతకు మునుపే పెళ్లయ్యింది. భర్తతో వివాదాలు ఏర్పడి విడాకులు తీసుకుంది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. అందుకే ఆ ప్రకటన ఇచ్చింది. తనకు కాబోయే వరుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయి ఉండాలట! MBA, MS చేసి ఉండాలట! ఇంటి పనులు చేయడానికి సదా ఓ పనిమనిషి ఉండాలట! ఇలాంటి అర్హతలు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే తనను సంప్రదించాలని ఆ మహిళ అంటోంది.. ఆ యువతి గొంతెయ్య కోరికలు (మగవాళ్లవి గొంతెమ్మ కోరికలు అయినప్పుడు ఆడవాళ్లకి గొంతెయ్య కోరికలే అవుతాయిగా) చూసి జనం షాకవుతున్నారు.

ehatv

ehatv

Next Story