చనిపోయాడనుకున్న వ్యక్తి హఠాత్తుగా లేచి కూర్చుంటాడు. ప్రాణం లేదని నిర్ధారించిన వ్యక్తులు మార్చురీలో(Mortuary) ఊపిరి తీసుకుంటూ ఉంటారు. నిజంగానే చనిపోయిన తర్వాత మళ్లీ బతకడం సాధ్యమవుతుందా? అప్పుడప్పుడు సాధ్యమవుతుంటుంది. లండన్‌లో(London) ఇలాంటి వింత సంఘటన మరోసారి చోటు చేసుకుంది. క్రిస్టీ బోర్టోస్(Kirsty Bortoft) అనే మహిళ చనిపోయినట్టు నిర్ధారించిన 40 నిమిషాల తర్వాత మళ్లీ ప్రాణాలతో బయటపడింది. స్పృహలోని లేని ఆ సమయంలో మరణం అంచుల వరకు వెళ్లివచ్చిందామె! ఆ సమయంలో తన అనుభూతులను సోషల్ మీడియాలో(Social media) వివరించింది.
చనిపోయాడనుకున్న వ్యక్తి హఠాత్తుగా లేచి కూర్చుంటాడు. ప్రాణం లేదని నిర్ధారించిన వ్యక్తులు మార్చురీలో(Mortuary) ఊపిరి తీసుకుంటూ ఉంటారు. నిజంగానే చనిపోయిన తర్వాత మళ్లీ బతకడం సాధ్యమవుతుందా? అప్పుడప్పుడు సాధ్యమవుతుంటుంది. లండన్‌లో(London) ఇలాంటి వింత సంఘటన మరోసారి చోటు చేసుకుంది. క్రిస్టీ బోర్టోస్(Kirsty Bortoft) అనే మహిళ చనిపోయినట్టు నిర్ధారించిన 40 నిమిషాల తర్వాత మళ్లీ ప్రాణాలతో బయటపడింది. స్పృహలోని లేని ఆ సమయంలో మరణం అంచుల వరకు వెళ్లివచ్చిందామె! ఆ సమయంలో తన అనుభూతులను సోషల్ మీడియాలో(Social media) వివరించింది. ఆమె ఏం చెప్పిదంటే 'మరణించిన తర్వాత మనిషికి మరో జన్మ ఉంటుందా(Life after death)? మరణంతోనే అంతా ముగిసిపోతుందా? ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. నాకు కూడా తరచూ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మళ్లీ బతుకుతాను అన్న ఆశే లేని సమయంలో జీవితం మరో అవకాశాన్ని ఇచ్చింది. ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను, నా భర్త స్టూ (Stu)డిన్నర్ డేట్‌కు ప్లాన్ చేసుకున్నాం. మరికాసేపట్లో బయలుదేరాల్సి ఉండగా అనుకోకుండా నేను సోఫాలో కుప్పకూలిపోయాను. పాపం స్టూ నన్ను పిలిచి పిలిచి అలసిపోయాడు. నాలో కొంచెం కూడా చలనం లేదు. నా ఆత్మ(Soul) శరీరం విడిచిపెట్టి వెళ్లిపోయిందని అనిపించింది. అంతలోనే నన్ను హాస్పిటల్‌కు(Hospital) తీసుకెళ్లారు. డాక్టర్లు నన్ను పూర్తిగా పరీక్షించి పెదవి విరిచారు. బతికే అవకాశాలు లేవని చెప్పడం నాకు వినిపించింది. నా కుటుంబసభ్యులకు కూడా ఇదే చెప్పారు. ధైర్యంగా ఉండమన్నారు. నన్ను పరీక్షించిన తర్వాత నేను చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు. కోమాలోకి వెళ్లిన దాదాపు 40 నిమిషాల తర్వాత నాకు మెలకువ వచ్చింది. అప్పుడు మళ్లీ మామూలు మనిషి అయ్యాను' అని క్రిస్టీ బోర్టోస్ వివరించింది. ఆమె ప్రాణాలతో లేచి కూర్చోవడంతో డాక్టర్లు(Doctors) కూడా ఆశ్చర్యపోయారు. మెదడుకు అయిదు నుంచి పది నిమిషాల పాటు ఆక్సిజన్ అందకుంటే మనిషి బతకడు. మరి క్రిస్టీ విషయంలో జరిగిన మెడికల్ మిరాకిల్ ఏమిటో డాక్టర్లకు ఇప్పటికీ అంతుపట్టడం లేదు. గతంలో ఆమె చాలాసార్లు గుండెపోటుకు గురయ్యింది. అలాంటిది ఆమె చావు వరకు వెళ్లి బతికిరావడం అన్నది ఆశ్చర్యకరమే అని డాక్టర్లు చెబుతున్నారు. మెదడుకు కాసేపు ఆక్సిజన్(Oxygen) అందకపోతే అవయవాలు దెబ్బతింటాయని, కానీ క్రిస్టీ విషయంలో గుండె, ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాలు ఇవన్నీ బాగానే ఉన్నాయని వైద్యులు తెలిపారు.