బ్యూటీపార్లర్‌కు వెళ్లిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. హెయిర్ కలర్ కోసం అబిడ్స్(abids) లోని న్యూ క్వీన్ బ్యూటీ సెలూన్ కి(New Queen Beauty Parlor) వెళ్లింది ఓ మహిళ. అక్కడ స్పెషల్ హెయిర్ స్టైల్ చేస్తానని బ్యూటీపార్లర్ నిర్వహుకురాలు చెప్పడంతో..
బ్యూటీపార్లర్‌కు వెళ్లిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. హెయిర్ కలర్ కోసం అబిడ్స్(abids) లోని న్యూ క్వీన్ బ్యూటీ సెలూన్ కి(New Queen Beauty Saloon) వెళ్లింది ఓ మహిళ. అక్కడ స్పెషల్ హెయిర్ స్టైల్ చేస్తానని బ్యూటీపార్లర్ నిర్వహుకురాలు చెప్పడంతో.. సదరు మహిళ చేయించుకునేందుకు ఓకే చెప్పింది. పార్లర్ నిర్వహకురాలు సొంతంగా తయారు చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్ కూడా వాడమనడంతో మహిళ ఆ ఆయిల్ కూడా వాడింది.
అయితే.. బ్యూటీపార్లర్ నిర్వహుకురాలు చెప్పినట్లు చేయడం వల్ల నా హెయిర్ పోయిందంటూ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పార్లర్‌లో ఇచ్చిన హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడితే పూర్తిగా నా జుట్టు రాలిపోయిందని వాపోయింది. వాటర్ పెడితే.. దువ్వెనతో దువ్వినా కూడా జుట్టు రాలిపోతుందని తన బాధను పోలీసులతో మొరపెట్టుకుంది.
నా జుట్టు పూర్తిగా మంచిగా అయ్యేలా ట్రీట్‌మెంట్ చూపించాలని బాధిత మహిళ కోరింది. క్వీన్ పార్లర్ ను వెంటనే సీజ్ చేయాలి డిమాండ్ చేసింది. పార్లర్ నిర్వహకులపై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. పోలీసులను పార్లర్ నిర్వహుకురాలిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు బాధిత మహిళ పేర్కొంది.