అమెరికాలోని(America) ఇటాలియన్‌ సబ్‌ రెస్టారెంట్‌(italian sub restaurant)కు వెళ్లిన ఓ మహిళ శాండ్‌విచ్‌ (sandwich) ఆర్డర్‌ చేసింది. మన కరెన్సీలో దాని రేటు 628 రూపాయలు. తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (bank of america) క్రెడిట్‌ కార్డును(credit Card) ఉపయోగించి పొరపాటున ఏడు వేల డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే ఆరు లక్షల రూపాయలపైచిలుకు సొమ్మును టిప్ ఇచ్చి వెళ్లిపోయింది. ఆ అమౌంట్‌ చూసి రెస్టారెంట్‌ వారు తెగ సంబరపడ్డారు. ఆమెది గొప్ప మనసు అని కితాబిచ్చారు.

అమెరికాలోని(America) ఇటాలియన్‌ సబ్‌ రెస్టారెంట్‌(italian sub restaurant)కు వెళ్లిన ఓ మహిళ శాండ్‌విచ్‌ (sandwich) ఆర్డర్‌ చేసింది. మన కరెన్సీలో దాని రేటు 628 రూపాయలు. తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (bank of america) క్రెడిట్‌ కార్డును(credit Card) ఉపయోగించి పొరపాటున ఏడు వేల డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే ఆరు లక్షల రూపాయలపైచిలుకు సొమ్మును టిప్ ఇచ్చి వెళ్లిపోయింది. ఆ అమౌంట్‌ చూసి రెస్టారెంట్‌ వారు తెగ సంబరపడ్డారు. ఆమెది గొప్ప మనసు అని కితాబిచ్చారు. కానీ ఆమె మనసు మార్చుకోవడంతో నిట్టూర్చారు. అసలేం జరిగిదంటే ఆ మహిళ చెల్లించాల్సిన డబ్బును ఎంటర్‌ చేయాల్సిన చోట తన ఫోన్‌ నంబర్‌లోని చివరి అంకెలను ఎంటర్‌ చేసింది. దీంతో ఆమె ప్రమేయం లేకుండానే బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా క్రెడిట్‌ కార్డు (credit card) ట్రాన్సక్షన్‌ పూర్తి అయ్యింది. చివరకు బిల్లు చూసిన ఆ మహిళ కెవ్వుమని కేకేసింది. అటు పిమ్మట గుడ్లు తేలేసింది. బావురుమంటూ బ్యాంక్‌కు పరుగులు తీసింది. తన సొమ్మను తిరిగి ఇప్పించండంటూ వేడుకుంది. ఆమె అభ్యర్థనను బ్యాంక్‌ వాళ్లు తిరస్కరించారు. ఎవరికి ఇచ్చావో వారినే అడుక్కోవాల్సిందిగా సూచించారు. దీంతో ఆమె సబ్‌వే రెస్టారెంట్‌(Subway) మేనేజ్‌మెంట్‌ను ఆశ్రయించింది. పొరపాటున చెల్లించిన టిప్‌ (tip)మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించింది. వారు దయ చూపించారు. హమ్మయ్యా అంటూ ఆమె ఊపిరి పీల్చుకుంది.

Updated On 25 Nov 2023 6:54 AM GMT
Ehatv

Ehatv

Next Story