ఇంతకీ భారతీయ జనతా పార్టీతో(BJP) తెలుగుదేశంపార్టీ(TDP) పొత్తు పెట్టుకున్నట్టేనా? సీట్లు పంపకాలు జరిగినట్టేనా? ఈ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. కొన్ని సందేహాలు అలాగే ఉన్నాయి. తమతో పొత్తు పెట్టుకోవాలంటూ బీజేపీ అధినాయకత్వం ఒకటే పోరుతుండటంతోనే చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఢిల్లీకి వెళ్లారని ఆ పార్టీ అనుకూల పత్రికలు బాకాలు ఊదుతాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకోకతప్పడం లేదని చంద్రబాబు అనుకుంటున్నారని రాతలు రాస్తాయి.

ఇంతకీ భారతీయ జనతా పార్టీతో(BJP) తెలుగుదేశంపార్టీ(TDP) పొత్తు పెట్టుకున్నట్టేనా? సీట్లు పంపకాలు జరిగినట్టేనా? ఈ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. కొన్ని సందేహాలు అలాగే ఉన్నాయి. తమతో పొత్తు పెట్టుకోవాలంటూ బీజేపీ అధినాయకత్వం ఒకటే పోరుతుండటంతోనే చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఢిల్లీకి వెళ్లారని ఆ పార్టీ అనుకూల పత్రికలు బాకాలు ఊదుతాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకోకతప్పడం లేదని చంద్రబాబు అనుకుంటున్నారని రాతలు రాస్తాయి. చీకటిపడిన తర్వాత అమిత్‌షా(Amit Shah), జెపీ నడ్డాలు(JP Nadda) కలిసి అయితే చంద్రబాబు వచ్చారు కానీ ఆ కలయిక పొత్తు కోసమా? స్వకార్యం కోసమా అన్నది తెలియడం లేదు. బీజేపీ పొత్తు కోసం గత రెండేళ్లుగా చంద్రబాబు తెగ ప్రయత్నిస్తారన్నది నిజం! ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ చంద్రబాబులో టెన్షన్‌ ఎక్కువవుతోంది. బీజేపీ పెద్దలు ఏం చేస్తారోనని చంద్రబాబు గాబరా పడుతున్నారు. తమతో పొత్తుకు బీజేపీ సై అంటుందా? లేక నై అంటుందా అని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు టీడీపీలో గుబులు రేపుతున్నాయి. దేశ రాజకీయాలు, వివిధ రాష్ట్రాలలో పొత్తుల గురించి మీడియాతో అమిత్‌ షా మాట్లాడారు. ఉత్తరాదిన(North) మెజారిటీ రాష్ట్రాలలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, దక్షిణాదిన(South) మాత్రం విశ్వసనీయమైన మిత్రుల కోసం వెతుకుతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఇప్పటికిప్పుడు పొత్తులపై ఏమీ మాట్లాడలేమని చెప్పారు. ఢిల్లీ(Delhi) నుంచి చంద్రబాబు వచ్చిన తర్వాత ఓ వర్గం మీడియా అంతా పొత్తులు కుదిరినట్టే అని రాశాయి. కానీ అమిత్ షా మాత్ర అందుకు భిన్నంగా మాట్లాడారు. పొత్తులపై ఇప్పుడేమీ మాట్లాడనని అన్నారు. దీంతో టీడీపీ వర్గాలలో కంగారు మొదలయ్యింది. పస్తుతం ఒంటరిగా పోటీ చేస్తే జగన్మోహన్‌రెడ్డిని(Jagan Mohan Reddy) ఓడించలేమన్న విషయం చంద్రబాబుకు అర్థమయ్యింది. అందుకే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను(Pawan Kalyan) దగ్గర తీసుకున్నారు. ఇది చాలదన్నట్టుగా బీజేపీ కూడా కూడితే బాగుంటుందని భావిస్తున్నారు. అందుకే పొత్తుల(Alliance) కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు ఒంటరిగా ఎప్పుడూ ఎన్నికల బరిలో దిగలేదు. ప్రతీసారి ఏదో ఒక పార్టీతో జత కట్టడం ఆయనకు అలవాటుగా మారింది. 2018లో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో(Congress) పొత్తు పెట్టుకున్నారు. దేశం కోసం పెట్టుకున్న పొత్తుగా చంద్రబాబు అనుకూల మీడియా రాసుకొచ్చింది. అప్పుడు దేశమంతా తిరిగారు చంద్రబాబు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేశారు. ఢిల్లీలో ధర్నాలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీపై(PM Modi) వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అమిత్ షా తిరుపతికి(Tirupathi) వచ్చినప్పుడు ఆయనపై రాళ్లు వేయించారు. ఇప్పుడు అదే బీజేపీ కరుణాకటాక్షాల కోసం ఎదురుచూస్తున్నారు. విశ్వసనీయమైన మిత్రుల కోసం చూస్తున్నామని అమిత్ షా అన్నారంటే చంద్రబాబు అంత నమ్మదగిన వ్యక్తి కాదని నమ్ముతున్నారా? అని డౌట్‌ వస్తుంది.

Updated On 10 Feb 2024 6:16 AM GMT
Ehatv

Ehatv

Next Story