Smitha Sabarwal: 'స్మితా సబర్వాల్కు 'డిప్యూటీ కలెక్టర్ స్థాయి పోస్టు'.. విధుల్లో చేరుతారా..?
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(Smita Sabarwal) పేరు తెలియనివారుండరు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులు, మిషన్ భగీరథ (Mission Bhagiratha) పనులనూ సమీక్షించేవారు
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(Smita Sabarwal) పేరు తెలియనివారుండరు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులు, మిషన్ భగీరథ (Mission Bhagiratha) పనులనూ సమీక్షించేవారు. కేసీఆర్ సీఎం ఉన్న సమయంలో సీఎంవో(CMO) అధికారిగా కూడా పని చేశారు. 2001లో ట్రైనీ కలెక్టర్‌గా ఐఏఎస్ విధుల్లో చేరిన స్మిత.. తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు.
ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం స్మితాసబర్వాల్‌పై బదిలీ వేటు వేసింది. గతంలో స్మిత కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ సమీక్ష సమావేశానికి ఆమె హాజరు కాకపోవడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ ఓ ట్వీట్ చేస్తూ.. తాను కేంద్ర సర్వీసులకు వెళ్లడం లేదని ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర కేడర్ అధికారిగా గర్విస్తున్నాని ఆమె తెలిపారు. తాజాగా ప్రభుత్వం ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. అనుకున్నట్లుగానే స్మితాసబర్వాల్ బదిలీ అయ్యారు. ఆమెకు ఫైనాన్స్ కమిటీలో మెంబర్ సెక్రటరీగా (Finance Committee member) పోస్టింగ్ ఇచ్చారు. తాజాగా స్మితాసబర్వాల్‌కు ప్రాధాన్యత లేని పోస్టును కేటాయించడంతో ఆమె విధుల్లో చేరుతారా లేదా అన్నది చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఇది డిప్యూటీ కలెక్టర్ (Deputy Collector) స్థాయి పోస్టు మాత్రమే. గ్రామ పంచాయితీలకు నిధులను సిఫారసు చేయడం తప్ప పెద్దగా పనులు ఏమీ ఉండవు. కేసీఆర్ (KCR) హయాంలో ప్రాధాన్యతగల పోస్టులు నిర్వహించడమే కాకుండా యాక్టింగ్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో బాధ్యతలు నిర్వహించిన స్మిత
ఇలాంటి చిన్నాచితక పోస్టులో విధులు నిర్వహిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.