బీఆర్‌ఎస్(BRS) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ కానున్నారు. వారం రోజులుగా కేసీఆర్ ఆసుపత్రిలో(Hospital) చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్‌కు గతవారం తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకుంటున్నారు. ఆసుప్రతిలో కేసీఆర్‌ను(KCR) అనేక మంది పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) , ఆయన సహచర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు ఇలా అందరూ కేసీఆర్‌ను పరామర్శించారు.
బీఆర్‌ఎస్(BRS) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ కానున్నారు. వారం రోజులుగా కేసీఆర్ ఆసుపత్రిలో(Hospital) చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్‌కు గతవారం తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకుంటున్నారు. ఆసుప్రతిలో కేసీఆర్‌ను(KCR) అనేక మంది పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) , ఆయన సహచర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు ఇలా అందరూ కేసీఆర్‌ను పరామర్శించారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ(NV Ramana), శాంతా బయోటిక్స్ అధినేత వరప్రసాద్ రెడ్డి(Varaprasad reddy) కూడా కేసీఆర్‌ను ప్రత్యక్షంగా కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గమనించదగ్గ విషయమేమింటే ఇప్పటి వరకు కేసీఆర్‌ను కలవడానికి ఒక్క బీజేపీ(BJP) నాయకుడు కూడా రాకపోవడం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎనిమిది ఎమ్మెల్యేలలో(MLA) ఏ ఒక్కరు కూడా కేసీఆర్‌ను పరామర్శించలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy) కూడా కలవకపోవడం ఆశ్చర్యం. ఎందుకంటే కేసీఆర్‌తో కిషన్‌రెడ్డికి మంచి అనుబంధమే ఉంది. కనీసం కామారెడ్డిలో(Kamareddy) కేసీఆర్‌పై గెలిచిన వెంకటరమణరెడ్డి(Venkataramana reddy) అయినా వస్తారని అనుకున్నారు. ఆయన కూడా రాలేదు. తాము వెళితే బీఆర్‌ఎస్-బీజేపీ ఒక తాను ముక్కలేనన్న ప్రచారానికి బలం చేకూర్చినట్టు అవుతుందని కాషాయదళ నేతలు భావించారేమో!కమలం నేతలు గులాబీ నేతను పరామర్శించకపోవడం ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఆఫ్ ది టాక్ అయ్యింది.