హట్ సమ్మర్‌లో కూల్ బీర్(Beer) తాగాలనుకునేవారు చాలా మందే ఉంటారు. వేసవిలో బీర్లకు మస్తు డిమాండ్ ఉంటుంది. కానీ తెలంగాణలో డిమాండ్‌కు సరిపడా బీర్ల సప్లయ్ ఉండటం లేదు. బీర్లు దొరకడం కనాకష్టమవుతోంది. ఇప్పటికే హాజీపూర్(Hajipur) మండటం గుడిపేటలోని మద్యం డిపోకు బీర్ల సరఫరా(Beers supplying) ఆగిపోయింది.
హట్ సమ్మర్‌లో కూల్ బీర్(Beer) తాగాలనుకునేవారు చాలా మందే ఉంటారు. వేసవిలో బీర్లకు మస్తు డిమాండ్ ఉంటుంది. కానీ తెలంగాణలో డిమాండ్‌కు సరిపడా బీర్ల సప్లయ్ ఉండటం లేదు. బీర్లు దొరకడం కనాకష్టమవుతోంది. ఇప్పటికే హాజీపూర్(Hajipur) మండటం గుడిపేటలోని మద్యం డిపోకు బీర్ల సరఫరా(Beers supplying) ఆగిపోయింది. ఇప్పుడున్న నిల్వలను డిపో పరిధిలోని లిక్కర్ షాపులకు, బార్‌లకు రేషియో పద్దతిలో సరఫరా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బీర్ల కొరత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ లిక్కర్ గోదాములకు పలు కంపెనీలు బీర్లను సప్లై చేశాయి. వాటికి ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదు. ఈ కారణంగానే పలు కంపెనీలు బీర్లను సరఫరా చేయడం లేదట! గుడిపేట లిక్కర్ డిపో పరిధిలో 135 లిక్కర్ షాపులున్నాయి. వాటితో పాటుగా 28 బార్‌లు ఉన్నాయి. లాస్టియర్ మార్చి మాసంలో రెండు లక్షల వరకు బీరు కేసుల అమ్మకాలు జరిగాయి. ఈసారి మాత్రం 1.80 లక్షల వరకు బీరు కేసుల అమ్మకాలు జరిగాయి. నిరుడు డిపోలలో లక్షల కేసుల నిల్వలు ఉండవి. ఈసారి మాత్రం వచ్చినవి వచ్చినట్టుగా అమ్మేస్తున్నారు. డిపోలో నిల్వలు అసలు ఉండటం లేదు. ఏప్రిల్, మే నెలల్లో బీర్ల కొరత తీవ్రం కానుడంతో బీరు ప్రియులు కలవరం చెందుతున్నారు.