కొత్త టెక్నాలజీతో వ్యవసాయం(Agriculture) చేయడం చూస్తున్నాం. యంత్రాలు(Machinary), పలు రకాల ఆధునిక పద్థతులు ఉపయోగించి రైతులు వ్యవసాయం చేయడం చూస్తాం. కానీ వరి నాటు కోసం ఎన్ని యంత్రాలు వచ్చినా అవి అంతగా విజయవంతం కాలేదు. దీంతో రైతులు కూలీల మీదనే ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. కానీ ఇప్పుడు కూలీల(Labours) అవసరం లేకుండా రోబోలు నాట్లు వేస్తున్నాయి. వరి పంటను కోసేందుకు కూడా ఈ రోబోలు ఉపయోగపడితున్నాయి.

వరి నాట్లు వేస్తున్న రోబోలకు(Robo) సంబంధించిన వీడియో గత కొంత కాలంగా సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది. వరి నాట్లు వేస్తున్న రోబోలు, వరి పంటను కూడా కోస్తున్న రోబోలు ఈ వీడియోల్లో మనం చూడొచ్చు. ఈ రోబోలు కూడా మనుషుల లాగే వరి మడిలోకి దిగి వరినాట్లు వేయడం, పంట కోయడం చేస్తాయి. ఈ రోబోల వ్యవసాయంపై నెటిజన్లు మాత్రం పలు రకాలుగా స్పందిస్తున్నారు. వ్యవసాయనికి కూలీల కొరతను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో మనుషులకు బదులు రోబోలు రావడంతో ఇకపై మనుషుల మీద ఆధార పడకుండా వ్యవసాయం చేస్కోవచ్చని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూలీ చార్జీలు మిగులుతాయిని, రోబోలు కొనుగోలు చేసి ఛార్జింగ్ పెడితే సరిపోతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రోబోలు కొనుగోలు, వాటి మెయింటెనెన్సు ఎక్కువగా ఉండొచ్చని కొందరు అంటున్నారు.