ఓ వ్యక్తి పాపులర్‌ అవ్వాలనుకున్నాడు. దానికోసం తనకున్న విద్యను ప్రదర్శించాలని అనుకున్నాడు. వ్యూస్‌ కోసం సాహసం చేశాడు. తాను చేసే పుష్‌-అప్‌(Push up) కోసం విద్యుత్‌ స్తంభాన్ని(Current poll) ఎక్కాడు. ప్రమాదకరంగా విద్యుత్‌ స్తంభానికి వేలాడుతూ పుష్‌-అప్‌ చేశాడు.

ఓ వ్యక్తి పాపులర్‌ అవ్వాలనుకున్నాడు. దానికోసం తనకున్న విద్యను ప్రదర్శించాలని అనుకున్నాడు. వ్యూస్‌ కోసం సాహసం చేశాడు. తాను చేసే పుష్‌-అప్‌(Push up) కోసం విద్యుత్‌ స్తంభాన్ని(Current poll) ఎక్కాడు. ప్రమాదకరంగా విద్యుత్‌ స్తంభానికి వేలాడుతూ పుష్‌-అప్‌ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో(Social media) వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి చాలా మంది ఆశ్చర్యపోగా.. ఇదెక్కడి పిచ్చిరా బాబు అని తలలు పట్టుకుంటున్నారు.

hilman6141 అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పొడవైన వీధి లైట్ స్తంభం పైకి ఎక్కాడు. ఆ స్థంభానికి వేలాడుతూ పుష్-అప్స్ చేశాడు. యువకుడు చేస్తున్న ప్రమాదకర స్టంట్‌ను మరొకరు వీడియో తీశారు. ఇక దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో పెట్టిన కొద్ది గంటల్లోనే లక్షలు వ్యూస్‌ సంపాదించుకుంది. దాదాపు 5 లక్షల మందికిపైగా వీడియోను చూశారు. ఈ వీడియోపై నెటిజన్లు పలురకాలు స్పందించారు. జీవితాన్ని ఎందుకు త్యాగం చేస్తున్నావని కొందరు అనగా . ఇలాంటి విన్యాసాలు చేయడం వల్ల ఏం వస్తుందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్‌ అంటూ మరొకరు అన్నారు.

Updated On 30 Jan 2024 7:02 AM GMT
Ehatv

Ehatv

Next Story