బెట్టింగ్‌ యాప్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్న సజ్జనార్‌.. వాటిని ప్రమోట్‌ చేసే ఇన్ఫ్లుయెన్సర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బెట్టింగ్‌ యాప్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్న సజ్జనార్‌.. వాటిని ప్రమోట్‌ చేసే ఇన్ఫ్లుయెన్సర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి వ్యతిరేకంగా గత కొంత కాలంగా సజ్జనార్‌ పోస్టులు పెడుతున్నారు. సోషల్‌ మీడియాలో అవేర్‌నెస్‌ క్రియేట్‌ చేస్తున్నారు. బెట్టింగులకు, వాటిని ప్రోత్సహించేవారికి దూరంగా ఉండాలని చైతన్యపరుస్తున్నారు. తాజాగా ఆయన బెట్టింగ్‌ యాప్‌ను ప్రోత్సహించే మరో ఇన్ఫ్లుయెన్సర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ''చేస్తున్న‌దే త‌ప్పు.. అదేదో సంఘ‌సేవ చేస్తున్న‌ట్టు ఎంత గొప్ప‌లు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌కుంటే ఎవ‌రో ఒక‌రు చేస్తార‌ని ఈయ‌న చేస్తున్నాడ‌ట. బుద్దుందా అస‌లు!ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే క‌నీసం ప‌శ్చాత్తాపం లేదు. వీళ్లకు డ‌బ్బే ముఖ్యం, డ‌బ్బే స‌ర్వ‌స్వం.. ఎవ‌రూ ఎక్క‌డ పోయినా, స‌మాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్న‌మైన సంబంధం లేదు. ఈయ‌న‌కు 100 కోట్ల నుంచి 500 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ చేశార‌ట‌. అంతగ‌నం డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్‌లో పెట్టి కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ల‌నా.. మీరు ఫాలో అవుతోంది. వెంట‌నే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌ను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్ల‌ను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంత‌మొందించ‌డంలో మీ వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించండి'' అంటూ ఆయన పోస్టు చేశారు.

ehatv

ehatv

Next Story