హైదరాబాద్(Hyderabad) నగరం నిప్పుల కుంపటిగా మారుతోంది. రానురాను కాంక్రీట్ జంగల్‌గా తయారవుతోంది. ఒకప్పుడు హైదరాబాద్ వాతావరణమంటే ఇష్టపడనివారులేరు. కానీ క్రమక్రమేణా ఇక్కడ వాతావరణం వేడెక్కుతోంది. చెట్ల నరికివేత(Deforestration), పట్టణీకరణతో నగరంలో నిప్పుల కుంపటిగా మారుతోందని హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

hyderabad Heat Islands
హైదరాబాద్(Hyderabad) నగరం నిప్పుల కుంపటిగా మారుతోంది. రానురాను కాంక్రీట్ జంగల్‌గా తయారవుతోంది. ఒకప్పుడు హైదరాబాద్ వాతావరణమంటే ఇష్టపడనివారులేరు. కానీ క్రమక్రమేణా ఇక్కడ వాతావరణం వేడెక్కుతోంది. చెట్ల నరికివేత(Deforestration), పట్టణీకరణతో నగరంలో నిప్పుల కుంపటిగా మారుతోందని హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. మార్చిలో నగరవ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదైనట్లు వెల్లడించింది. వీటినే అర్బన్ హీట్ ఐలాండ్స్(Urban Heat Islands) అని.. భూ ఉపగ్రహ, గూగుల్ ఎర్త్‌లోని ఉష్ణోగ్రతల సమాచారాన్ని హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ సంస్థ పరిశోధించింది. బీఎన్‌రెడ్డినగర్, మైలార్‌దేవ్‌పల్లి, హయత్‌నగర్, గచ్చిబౌలి, పటాన్‌చెరు, బండ్లగూడ, మన్సూరాబాద్ ప్రాంతాల్లో భూమి విపరీతంగా వేడెక్కినట్లు నివేదిక ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకుపైనే ఉండే అవకాశం ఉందని పరిశోధకలు తెలిపారు. అయితే చెట్ల నరికివేతను నిలువరించి, చెట్లను పచ్చదనాన్ని విస్తరించాలని సూచిస్తున్నారు. లేకుంటే ఇలాంటి హీట్ ఐలాండ్లు మరిన్ని పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
