Shock to Egg Lovers: గుడ్డు, ఆమ్లెట్ ప్రియులకు చేదువార్త..!
గుడ్డు (Egg) ప్రియులకు ఇది చేదువార్తనే చెప్పాలి. కోడి గుడ్డు ధరలు రోజురోజుకు కొండెక్కిపోతున్నాయి. ఎందుకంటే కోడిగుడ్డు ధర రిటైల్ మార్కెట్‌లో ఏడు (Rs.7) రూపాయాలకుపైగానే అమ్ముతున్నారు. వారంలోనే డజన్ కోడిగుడ్ల ధర దాదాపు రూ.18 పెరిగింది.
గుడ్డు (Egg) ప్రియులకు ఇది చేదువార్తనే చెప్పాలి. కోడి గుడ్డు ధరలు రోజురోజుకు కొండెక్కిపోతున్నాయి. ఎందుకంటే కోడిగుడ్డు ధర రిటైల్ మార్కెట్‌లో ఏడు (Rs.7) రూపాయాలకుపైగానే అమ్ముతున్నారు. వారంలోనే డజన్ కోడిగుడ్ల ధర దాదాపు రూ.18 పెరిగింది. గతవారంలో డజన్ కోడిగుడ్డు ధర 66 రూపాయలు ఉంటే.. ఇప్పుడు ఏకంగా అది రూ.84కు చేరింది. కోడు గుడ్డు ధర పెరగడానికి ముఖ్య కారణం కోళ్ల దాణా (Feed) పెరగడమే కారణమంటున్నాయి మార్కెట్ వర్గాలు.
గతంలో కిలో దాణా నాణ్యతను బట్టి రూ.14 నుంచి రూ. 18 వరకు ఉండేదని.. ఇప్పుడు కిలో ధర దాదాపు 30 రూపాయల వరకు చేరినందునే గుడ్డు ధరలు పెరుగుతున్నాయని పౌల్ట్రీ (Poultry) వ్యాపారవేత్తలు విశ్లేషిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి కూడా లేకపోవడంతోనే గుడ్ల ధరలు పెంచామని పౌల్ట్రీ నిర్వాహకులు చెప్తున్నారు. డిమాండ్ ఇలాగే కొనసాగితే మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. కార్తీకమాసం ముగియడం, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో గుడ్ల ధరలు పెరిగాయని చెప్తున్నారు.