తిరుమల (Tirumala) మెట్ల మార్గంలో మారోసారి చిరుత (cheetah సంచారం కలకలం రేపింది. చిన్నారి లక్షితపై (Lakshitha) దాడి చేసిన ప్రాంతంలోనే సంచరించినట్లు సీసీ కెమెరాల్లో (CC Cameras) గుర్తించారు. ఈనెల 13, 26 తేదీల్లో ఎలుగుబంటి, చిరుత కదలికలు కెమెరాల్లో చిక్కాయి.

తిరుమల (Tirumala) మెట్ల మార్గంలో మారోసారి చిరుత (cheetah సంచారం కలకలం రేపింది. చిన్నారి లక్షితపై (Lakshitha) దాడి చేసిన ప్రాంతంలోనే సంచరించినట్లు సీసీ కెమెరాల్లో (CC Cameras) గుర్తించారు. ఈనెల 13, 26 తేదీల్లో ఎలుగుబంటి, చిరుత కదలికలు కెమెరాల్లో చిక్కాయి. తిరుమల వెళ్లే భక్తుల్ని టీటీడీ (TTD) మరోసారి అప్రమత్తం చేసింది. ట్రాప్ కెమెరాలకు చిరుత, ఎలుగుబంటి కదలికలు చిక్కాయి. గడచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో కదలికలు రికార్డయ్యాయి. శ్రీ నరసింహ స్వామి (Sri Lakhsmi Narasimha Swamy) ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిక్కిన చిరుత, ఎలుగుబంటి (Bear) కదలికలు దొరికాయి. దీంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది.. తిరుమలకు నడకమార్గంలో వెళ్లే భక్తులకు కొన్ని సూచనలు చేసింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని.. గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.

గతంలో అలిపిరి మెట్ల మార్గంలో పలుసార్లు చిరుతులు సంచరించాయి. కొంతకాలం క్రితం ఓ బాలుడిపై దాడి చేయగా.. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన బాలిక లక్షితపై దాడి చేసి చంపేసింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ, అటవీశాఖ అధికారులతో (Forest Officers) కలిసి బోన్లు ఏర్పాటు చేసి ఐదు చిరుతల్ని బంధించారు. దీంతో చిరుతల బాధ తప్పిపోయిందని అటవీశాఖ అధికారులు భావించారు.. కానీ తాజాగా మరో చిరుత, ఎలుగుబంటి సంచరించినట్లు గుర్తించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నడకమార్గంలో కొన్ని నిబంధనల్ని అమలు అమలు చేస్తున్నారు.

Updated On 29 Dec 2023 10:35 PM GMT
Ehatv

Ehatv

Next Story