బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు వారికి అవమానం అంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై పోలీస్ స్టేషన్లో టీటీడీ ఫిర్యాదు చేసింది.
బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు వారికి అవమానం అంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై పోలీస్ స్టేషన్లో టీటీడీ ఫిర్యాదు చేసింది. ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు తిరుమల యాత్రలో భాగంగా టీటీడీలె అవమానం అంటూ దుష్ప్రచారం చేశారని సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో జనవరి 28, 2025న టీటీడీ ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిర్వాహకులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో కేసు నెం. 13/2025 గా నమోదైంది. బ్రహ్మర్షి డా. చాగంటి కోటేశ్వర రావు తిరుమల పర్యటనపై వాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా టీటీడీ వెల్లడించినా, సదరు సోషల్ మీడియా ప్రతినిధులు 1. డయల్ న్యూస్, హైదరాబాద్, (2.)పోస్ట్ 360, హైదరాబాద్, (3.)జర్నలిస్ట్ వైఎన్ఆర్ , (YNR) హైదరాబాద్, వారు పదే పదే టీటీడీ ప్రతిష్టను దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో అవాస్తవాలను ప్రచారం చేశారని ఆరోపించారు. అసలు చాగంటి పర్యటనలో ఏం జరిగింది.. ఈ కేసుకు కారణమైన సీనియర్ జర్నలిస్టు 'YNR' చేసిన విశ్లేషణ ఈ వీడియోలో ఉంది.