సింగరేణి(singareni Elections) ఎన్నికలపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‎ విచారించిన హైకోర్టు..తదుపరి విచారణను డిసెంబర్ 21కి వాయిదా వేసింది. ఇప్పటికే రకరకాల కారణాలతో మూడుసార్లు వాయిదాపడిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు మరోసారి వాయిదాపడే అవకాశం కనిపిస్తోంది.

సింగరేణి ఎన్నికలు మరోసారి వాయిదా(elections postpone) పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడం, ఇతర కారణాల దృష్ట్యా..ఎన్నికలను మార్చి నెలాఖరుకు వాయిదా వేయాలని ప్రభుత్వం హైకోర్టులో(High cout) పిటిషన్ దాఖలు చేసింది. పరిపాలన, శాంతిభద్రతల పరమైన ఇబ్బందులు ఉండటం వల్ల ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని.. ఎన్నికలకు మరింత గడువు కావాలని కోరింది. మార్చి తర్వాత ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించిన ప్రభుత్వం..ఈ మేరకు హైకోర్టులో పిటిషన్​ వేసినట్లు ప్రచారం జరుగుతుంది.

అయితే అసెంబ్లీ ఎన్నికల(Assembly election) ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తుచేసింది. అయితే సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు సమయం కావాలని కోరడంతో.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది.

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదాపడుతూనే ఉన్నాయి. గతంలో వేర్వేరు కారణాలతో ఎన్నికలు మూడుసార్లు వాయిదాపడ్డాయి. చివరికి అక్టోబరులో వచ్చిన సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కూడా సింగరేణి గుర్తింపు ఎన్నికలకు అడ్డుగా మారాయి. ఈ నెల 21న సింగరేణి ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే విష‌యంలో సందిగ్ధ‌త నెల‌కొంది.

Updated On 18 Dec 2023 4:45 AM GMT
Ehatv

Ehatv

Next Story