North Sentinel Island : ఆ దీవిలో అడుగుపెడితే అంతే సంగతులు.. ప్రాణాలతో వెనక్కి రాలేరు!
అదో చిన్న ద్వీపం(Island).. దాని పేరు నార్త్ సెంటినెల్(North Sentinel).. అండమాన్ నికోబార్(Andaman Nicobar Island) ద్వీప సమూహాలలో ఇది ఒకటి. దక్షిణ అండమాన్ జిల్లా పరిధిలో ఉంటుది. ఎంతో ఉండదు.. 23 చదరపు మైళ్ల విస్తీర్ణం ఉంటుందంతే! ఎంతో మంది ఉండరు. ఎక్కువలో ఎక్కువ నాలుగు వందల మంది ఉంటారంతే! వీరికి మిగతా ప్రపంచంతో సంబంధం లేదు.
అదో చిన్న ద్వీపం(Island).. దాని పేరు నార్త్ సెంటినెల్(North Sentinel).. అండమాన్ నికోబార్(Andaman Nicobar Island) ద్వీప సమూహాలలో ఇది ఒకటి. దక్షిణ అండమాన్ జిల్లా పరిధిలో ఉంటుది. ఎంతో ఉండదు.. 23 చదరపు మైళ్ల విస్తీర్ణం ఉంటుందంతే! ఎంతో మంది ఉండరు. ఎక్కువలో ఎక్కువ నాలుగు వందల మంది ఉంటారంతే! వీరికి మిగతా ప్రపంచంతో సంబంధం లేదు. నాగరికులంటే వీరికి అసలు పడదు. అక్కడికి ఎవరూ వెళ్లరు. సాహసం చేసి ఎవరైనా వెళితే మాత్రం తిరిగిరారు. ఇది గమనించే ప్రభుత్వం దాన్ని ఒక నిషిద్ధ ప్రాంతంగా(Restricted Place) పరిగణిస్తుంటుంది. అక్కడికి వెళ్లడానికి ఎవరినీ అనుమతించకూడదనే నిర్ణయం తీసుకుంది. 60 వేల సంవత్సరాలుగా సమూహంలో ఒంటరిగా ఉంటూ వస్తున్నది ఆ సెంటినలీస్ తెగ. ఆ ద్వీపవాసులు ప్రపంచానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు జస్ట్ 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా నాగరికులు అక్కడికి వెళ్లడానికి జంకుతారు.
రెండు వేల ఏళ్లుగా సెంటినలీస్ తెగ ఇక్కడ నివసిస్తున్నట్టు కార్బన్ డేటింగ్(Carbon dating) పరీక్షల ద్వారా తేలింది. మనకంటే తక్కువ ఎత్తులో ఉండే ఇక్కడి మనషులు నరుడన్న వాడిని చూస్తే నరికేస్తారు. 2004లో సునామీ అనేక తీర ప్రాంతాలను నాశనం చేసింది. సెంటినెలస్ ద్వీపంలో ఉన్న వారికి చేయూతనందించడానికి ప్రభుత్వం భారత కోస్ట్ గార్డ్ నుంచి హెలికాఫ్టర్లను పంపింది. హెలికాఫ్టర్లపై కూడా బాణాలతో దాడులు చేశారు. 2006లో చేపల వేట కోసం ఇద్దరు మత్స్యకారులు పొరపాటున ఆ ద్వీపానికి దగ్గరగా వెళ్లారు. వారిని చూసిన తెగ ప్రజలు వారిని చంపేశారు. 2018లో ఇక్కడి ప్రజలకు మత బోధ చేయాలని వెళ్లిన జాన్ అలెన్ చౌ(John Allen Chow) అనే అమెరికన్ క్రైస్తవ మత ప్రబోధకుడిని కూడా సెంటినెలీస్ తెగ ప్రజలు దారుణంగా చంపేశారు. అందుకే ఈ ద్వీపాన్ని బయటి వ్యక్తులు సందర్శించేందుకు అనుమతి లేదు. ఈ ద్వీపవాసులను రక్షించడం కోసం భారత ప్రభుత్వం అండమాన్, నికోబార్ దీవుల నియంత్రణ, 1956 చట్టాన్ని జారీ చేసింది. అడ్మినిస్ట్రేషన్ మినహా ఇతరుల ప్రవేశాన్ని ఇక్కడ నిషేధించారు. 1967లో టి.ఎస్.పండిట్ అనే సైంటిస్టు ఆ ద్వీప ప్రజలతో సంబంధాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాడు. అనేక కానుకలను దీవిలో వదిలారు. అయినా ఆ తెగ ప్రజల మనసు మాత్రం మారలేదు. పండిట్ బృందం మళ్లీ 1970లో ఇదే ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా విఫలమయ్యింది. ఇప్పుడీ తెగ నెమ్మదిగా అంతరించిపోతున్నది. ప్రకృతి విపత్తులు, అంటు వ్యాధుల బారిన పడి చాలా మంది చనిపోతున్నారు.