బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. నిత్యవివాదుడిగా పేరున్న బండ్ల గణేష్‌పై ఫిలింనగర్ (Film Nagar) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

bandla case-compressed
బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. నిత్యవివాదుడిగా పేరున్న బండ్ల గణేష్‌పై ఫిలింనగర్ (Film Nagar) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన ఇంటికి నెలకు లక్ష రూపాయలు ఇస్తానని అద్దెకు తీసుకున్నాడని, గత కొంత కాలంగా అద్దె చెల్లించకపోవడంతో పాటు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నాడని పోలీసులు హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా (Nouheera Shaik) షేక్ ఫిర్యాదు చేశారు. అయితే గత కొంతకాలంగా గణేష్ అద్దె ఇవ్వకపోగా గుండాలతో తనను బెదిరిస్తున్నారని, తనను ఇంట్లోకి అనుమతించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంతే కాకుండా ఇంట్లో అసాంఘి క కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని తమకు సమాచారం ఉందని.. రౌడీలు, రాజకీయ నేతల అండదండలతో తన ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. నౌహీరా ఫిర్యాదు మేరకు బండ్ల గణేష్‌పై ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
