తిరుమలకు భక్తుల తాకిడి తగ్గింది. సంక్రాంతికి పండుగకు జనం అంతా సొంతూళ్లకు వెళ్లడంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిపోయింది. క్యూలైన్‎లలో వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండానే స్వామివారి దర్శనం ఈజీగా అయిపోతోంది. దర్శనం టికెట్లు లేని భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

తిరుమలకు భక్తుల తాకిడి తగ్గింది. సంక్రాంతికి పండుగకు జనం అంతా సొంతూళ్లకు వెళ్లడంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిపోయింది. క్యూలైన్‎లలో వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండానే స్వామివారి దర్శనం(Tirumala Srivari Darshan ) ఈజీగా అయిపోతోంది. దర్శనం టికెట్లు లేని భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇక తిరుమల శ్రీవారిని నిన్నటి రోజున (జనవరి 13 శనివారం) 65 వేల 692 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24,575 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజు కానుకల రూపంలో హుండీలో రూ.3.78 కోట్లు ఆదాయం(Income of Rs.3.78 crores)వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) అధికారులు వెల్లడించారు. తిరుమలలోనూ భోగీ సంబరాలు (Bhogi celebrations) జరుపుకున్నారు. గోవింద‌రాజ స్వామివారి ఆల‌యం ప్రాంగణంలో టీటీడీ అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులు భోగి మంట వేశారు. కలియుగ దేవుడైన శ్రీనివాసుడి క్షేత్రంలో భోగి పండుగ జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు చెబుతున్నారు.

ఇక భోగీ పండుగ సందర్భంగా సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు. జనవరి 15న మకర సంక్రాంతి సంద‌‌ర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఆల‌యం నుండి చ‌క్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా క‌పిల‌తీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్కడ చ‌క్రస్నానం అనంత‌రం ఆస్థానం చేప‌డ‌తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజస్వామివారు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిస్తారు. ఇక సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Updated On 14 Jan 2024 1:39 AM GMT
Ehatv

Ehatv

Next Story