మంచి ఆహారం కోసమో, సంతానోత్పత్తి కోసమే పశు పక్ష్యాదులు వలస వెళుతుంటాయి. బాటలు నడచీ, పేటలు కడచీ, కోటలన్నింటినీ దాటుకుంటూ, నదీ నదాలూ, అడవులు కొండలు ఎడారులను అధగమిస్తూ గమ్యాన్ని చేరుకుంటాయి. అమెరికాలోని(America) కాలిఫోర్నియాలోని(California) స్టాక్‌టన్‌లో(Stockton) ఇలాగే వేలాది చిరుకప్పలు(Toads) వలస వెళుతున్న దృశ్యం కనిపించింది. ఓ మైలు పొడవున రోడ్డు మీద కుప్పలు తెప్పలుగా కప్పలు ఉండటం చాలా మందికి ఆశర్యాన్ని కలిగించింది. ఈ మండూకాలను మొదట చూసింది మేరీ హులెట్‌ అనే మహిళ.

మంచి ఆహారం కోసమో, సంతానోత్పత్తి కోసమే పశు పక్ష్యాదులు వలస వెళుతుంటాయి. బాటలు నడచీ, పేటలు కడచీ, కోటలన్నింటినీ దాటుకుంటూ, నదీ నదాలూ, అడవులు కొండలు ఎడారులను అధగమిస్తూ గమ్యాన్ని చేరుకుంటాయి. అమెరికాలోని(America) కాలిఫోర్నియాలోని(California) స్టాక్‌టన్‌లో(Stockton) ఇలాగే వేలాది చిరుకప్పలు(Toads) వలస వెళుతున్న దృశ్యం కనిపించింది. ఓ మైలు పొడవున రోడ్డు మీద కుప్పలు తెప్పలుగా కప్పలు ఉండటం చాలా మందికి ఆశర్యాన్ని కలిగించింది. ఈ మండూకాలను మొదట చూసింది మేరీ హులెట్‌ అనే మహిళ. ఆమె విమానాశ్రయం నుంచి ఇంటికి కారులో వెళుతున్నప్పుడు ఆమెకు రోడ్డుపై ఏదో కదులుతున్నట్టు కనిపించింది. తన ముందు కార్లు ఎందుకు ఆగిపోయాయో అప్పుడామెకు అర్థం కాలేదు. రోడ్డుపై నిశితంగా చూసినప్పుడు కప్పల సైన్యం రహదారికి అడ్డుగా ఉందని ఆమె తెలుసుకుంది. ఆ కప్పలు రోడ్డును దాటడాన్ని గమనించానని పేర్కొన్నారు.
ఈ విధంగా కప్పల వలసలను చూసిన జీవశాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. సిల్వర్ అవెన్యూలో ఎస్‌ కర్వ్స్ అనే ప్రాంతంలో ఈ చిరు కప్పలు కనిపించాయి. ఈ కప్పలను గ్రేట్‌ బేసిన్‌ స్పాడెఫుట్‌ టోడ్స్‌ అని అంటారని వైల్డ్‌లైఫ్ రిసోర్సెస్ సెంట్రల్ రీజియన్‌లోని ఉటా విభాగానికి చెందిన ఆక్వాటిక్స్ మేనేజర్ క్రిస్ క్రోకెట్ తెలిపారు. అవి చుట్టుపక్కల ఉన్న కొండలకు వలస వెళుతున్నాయని అన్నారు. విషాదమేమిటంటే కొన్ని కార్లు ఆ చిరుకప్పల మీదుగా వెళ్లడంతో వేల సంఖ్యలో అవి చనిపోవడం. చలించిపోయిన స్థానికులు ఈ కప్పలను కాపాడేందుకు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated On 25 July 2023 1:32 AM GMT
Ehatv

Ehatv

Next Story