తిరుమలలో(Tirumala) రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రేపటి నుంచి వచ్చే నెల 14 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ(TTD) అధికారులు ప్రకటించారు. సుప్రభాత సేవకు బదులు తిరుప్పావైతో(Tiruppavai) శ్రీవారికి మేల్కోలుపు కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. నెల రోజులపాటు మేల్కోలుపు కార్యక్రమం ఇది కొనసాగనుంది.
తిరుమలలో(Tirumala) రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రేపటి నుంచి వచ్చే నెల 14 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ(TTD) అధికారులు ప్రకటించారు. సుప్రభాత సేవకు బదులు తిరుప్పావైతో(Tiruppavai) శ్రీవారికి మేల్కోలుపు కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. నెల రోజులపాటు మేల్కోలుపు కార్యక్రమం ఇది కొనసాగనుంది. అయితే ఈనెల 19న స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరమంజనం ఉన్న సందర్భంగా వీఐపీ(VIP) బ్రేక్ దర్శనాలను బోర్డు రద్దు చేసింది. దీనితో పాటు అష్టదళపాదపద్మారాదనను కూడా రద్దు చేశారు. ఈనెల 23 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. రోజుకు 42500 చొప్పున 10 రోజులపాటు 4.25 లక్షల టికెట్లను ఆఫ్‌లైన్‌లో(Offline) జారీ చేస్తామని తెలిపారు.