Shock to 10 more MLAs: మరో 10 మంది సిట్టింగ్లకు షాక్..మూడో జాబితాలో మూడేదెవరికి?
అధికార వైసీపీలో మార్పులు చేర్పులు అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే కొందరు సిట్టింగ్ లను మార్చిన వైసీపీ అధిష్టానం..మూడో జాబితాలో మరికొందరికి మొడి చేయి చూపనుందా? కొన్ని ప్రాంతాల్లో సిట్టింగ్ లను కాదని కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా? అంటే అవునే సమాధానం వస్తోంది. ఇంతకీ మూడో జాబితాలో మూడేదెవరికి? అనేదానిపై వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
అధికార వైసీపీలో మార్పులు చేర్పులు అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే కొందరు సిట్టింగ్ లను మార్చిన వైసీపీ అధిష్టానం..మూడో జాబితాలో మరికొందరికి మొడి చేయి చూపనుందా? కొన్ని ప్రాంతాల్లో సిట్టింగ్ లను కాదని కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా? అంటే అవునే సమాధానం వస్తోంది. ఇంతకీ మూడో జాబితాలో మూడేదెవరికి? అనేదానిపై వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మార్పులు చేర్పులు చేపట్టిన వైసీపీ అధినేత జగన్(YCP chief Jagan) బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. ఇప్పటికే రెండు జాబితాల్లో 38 మంది సిట్టింగ్ లను మార్చిన వైసీపీ అధిష్టానం.. మూడో జాబితా(Third list)పై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. సర్వేల్లో వ్యతిరేకత, ప్రజల్లో సానుకూలతలేని సిట్టింగ్లను మారుస్తున్నారు. మరికొందరి నియోజకవర్గాలను మార్చేస్తున్నారు. అభ్యర్థులను మార్చి చోట కొత్తవారికే ఛాన్స్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. రెండో జాబితాలో మంత్రి గుడివాడ అమర్నాథ్(Mantri Gudivada Amarnath)కు పార్టీ షాకిచ్చింది. ఆయన సెగ్మెంట్ అనకాపల్లి(anakapalle)కి మలసాల భరత్ కుమార్(Malasala Bharat Kumar)ను కొత ఇంఛార్జీగా నియమించింది. మూడో జాబితా మరింత కఠినంగా ఉండబోతుందని సంకేతాలు రావడతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన మొదలైంది. మూడో జాబితాలో మరో 10 చోట్ల అభ్యర్థులను మార్చబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నందికొట్కూరు, ఆలూరు, కర్నూలు, శింగనమల, గూడూరు, చోడవరం చింతలపూడి, పెందుర్తి, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చబోతున్నారని సమాచారం. మూడో జాబితాలో ఇద్దరు మంత్రులు(Ministers) గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram), తానేటి వనిత(Taneti Vanita) పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్(Kurnool MLA Hafeez Khan), నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్(Nandikotkur MLA Toguru Arthur), శింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే(Shinganamala MLA) జొన్నలగడ్డ పద్మావతి (Jonnalagadda Padmavathy), చింతలపూడి ఎమ్మెల్యే ఏలిషా(Chintalapudi MLA Elisha)లకు మొండి చేయి తప్పదనే తెలుస్తోంది. మొత్తానికి మొదటి రెండు జాబితాల నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యేలకు..ఈసారి పిలుపు రావచ్చన్న ప్రచారం ఉంది. దీంతో తాడేపల్లి నుంచి ఎవరికి ఫోన్ వస్తుందోనన్న ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది.