హైదరాబాద్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) శుభవార్త చెప్పింది. మెట్రో కొత్త మార్గాలకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 70 కిలో మీటర్ల మేర రెండో దశ మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలకు ఆమోద తెలిపారు. 4 కారిడార్లుగా మెట్రోను పొడిగించాలని నిర్ణయించారు.

metro-compressed

మెట్రో మార్గాలివే..!
—>ఎంజీబీఎస్ (MGBS) నుంచి ఫలక్‌నుమా (Falaknuma) వరకు 5.5 కిలో మీటర్లు, ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలో మీటర్లు
—> నాగోల్ (Nagole) నుంచి ఎల్బీనగర్ వరకు.. నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం (Airport) వరకు 29 కిలో మీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. నాగోల్ - ఎల్బీనగర్ - చాంద్రాయణగుట్ట - మైలార్‌దేవ్‌పల్లి మీదుగా ఈ మార్గం ఉండనుంది. కారిడార్-4లో భాగంగా ఆరామ్‌ఘర్ మీదుగా మైలార్‌దేవ్‌పల్లి నుంచి హైకోర్టు వరకు 4 కి.మీ. మేర మెట్రో నిర్మాణం ఉండనుంది.
—> రాయదుర్గం (Raidurg) నుంచి అమెరికన్ కాన్సులేట్ (US Consulate) వరకు 8 కిలో మీటర్లు నిర్మించనున్నారు. ఈ మార్గం రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్‌రాంగూడ జంక్షన్, విప్రో జంక్షన్ , యూఎస్ కాన్సులేట్ వరకు ఈ మార్గాన్ని నిర్మిస్తున్నారు.
—>మియాపూర్ (Miayapur) మెట్రో స్టేషన్ నుంచి పటాన్‌చెరు (Patancheru) వరకు 14 కి.మీ మేర మెట్రో మార్గం ఉండనుంది.
—> ఎల్బీనగర్ (L.B.Nagar) మెట్రో స్టేషన్ నుంచి హయత్‌నగర్ (Hayathnagar) వరకు 8 కి.మీ వరకు మెట్రో మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు.