న‌కిలీ మైసూర్ శాండిల్ స‌బ్బుల‌ను(Mysore Sandal Soap) త‌యారు చేసి విక్ర‌యిస్తున్న ముఠాను మ‌ల‌క్‌పేట(Malakpet) పోలీసులు అరెస్టు(arrest) చేశారు.సోదాలు నిర్వ‌హించిన పోలీసులు న‌కిలీ ఉత్ప‌త్తుల‌తో పాటు దాదాపు రూ. 2 కోట్ల విలువైన త‌యారీ సామాగ్రిని సీజ్ చేశారు.

న‌కిలీ మైసూర్ శాండిల్ స‌బ్బుల‌ను(Mysore Sandal Soap) త‌యారు చేసి విక్ర‌యిస్తున్న ముఠాను మ‌ల‌క్‌పేట(Malakpet) పోలీసులు అరెస్టు(arrest) చేశారు.సోదాలు నిర్వ‌హించిన పోలీసులు న‌కిలీ ఉత్ప‌త్తుల‌తో పాటు దాదాపు రూ. 2 కోట్ల విలువైన త‌యారీ సామాగ్రిని సీజ్ చేశారు. రాకేశ్ జైన్, మ‌హావీర్ జైన్ క‌లిసి ఈ న‌కిలీ స‌బ్బుల‌ను త‌యారు చేస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి చెందిన కేఎస్‌డీఎల్ సంస్థ‌కు మైసూర్ శాండిల్ స‌బ్బుల‌పై పేటెంట్ హ‌క్కులు ఉన్నాయి. హైద‌రాబాద్ కేంద్రంగా న‌కిలీ మైసూర్ శాండిల్ స‌బ్బులు మార్కెట్‌లోకి వ‌స్తున్న‌ట్లు కొన్ని రోజుల క్రితం క‌ర్ణాట‌క ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి, కేఎస్‌డీఎల్ చైర్మ‌న్ ఎంబీ పాటిల్‌కు స‌మాచారం అందింది. ఆయన తెలంగాణ అధికారుల‌కు, పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో తాజాగా దాడులు నిర్వహించారు.

Updated On 14 Jan 2024 1:15 AM GMT
Ehatv

Ehatv

Next Story