తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వచ్చి నెల పూర్తయింది. ఈరోజు తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) భేటీ జరగనుంది. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పూటి వరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు, ఆరోగ్య శ్రీని (Arogya Sri) రూ.10 లక్షలకు పెంచింది.

తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వచ్చి నెల పూర్తయింది. ఈరోజు తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) భేటీ జరగనుంది. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పూటి వరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు, ఆరోగ్య శ్రీని (Arogya Sri) రూ.10 లక్షలకు పెంచింది. అయితే మరో రెండింటిని ఈ వారంలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇవాళ సమీక్ష ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీలో కూడా కూడా ఈ విషయం చర్చకు రానుంది.

రూ.500కే సబ్సిడీ సిలిండర్ (Rs.500 Cylinder), 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్‌పై (Free Power) నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రజలకు ఈ పథకాలు వర్తింపజేయాలని ప్రభుత్వ ఆలోచనగా ఉందట. అయితే కొత్తగా రేషన్‌ కార్డుల (Ration Cards) కోసం 10 లక్షల మందికిపైగానే దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్‌కార్డులున్నవారిని పరిశీలించి కొత్త కార్డులు వచ్చాక ఇస్తారా లేదా పాత కార్డులున్నవారికే ఈ పథకం అమలు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది

Updated On 7 Jan 2024 11:17 PM GMT
Ehatv

Ehatv

Next Story