తెలంగాణ(Telangana) ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులు అవుతోంది. కానీ ఆ పార్టీ నుంచి సీఎం(CM) అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. టీ-20, వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ కంటే ఈ సస్పెన్సే(Suspense) ఎక్కువ ఉందని పొలిటికల్(Political) విశ్లేషకులు చెప్తున్నారు. ఈనెల 3న ఫలితాల్లో(Results) కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించిన డీకే శివకుమార్(DK Shiva kumar).. పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. దానికంటే ముందు భట్టీ(Bhatti), ఉత్తమ్‌తో(Uttam) డీకే శివకుమార్ వేర్వేరుగా చర్చలు జరిపారు. సీఎంగా తమకు అవకాశాన్ని కల్పించాలని డీకే ముందు గట్టిగానే వాదించారు. తమకున్న అవకాశాలు, పార్టీలో తమ ప్రస్తానంపై వివరించారు. డీకే సమర్పించిన నివేదికపై ఖర్గే(Kharge) ఇంట్లో రాహుల్(Rahul gandhi), కేసీ వేణుగోపాల్(KC Venugopal) చర్చించారు.

తెలంగాణ(Telangana) ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులు అవుతోంది. కానీ ఆ పార్టీ నుంచి సీఎం(CM) అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. టీ-20, వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ కంటే ఈ సస్పెన్సే(Suspense) ఎక్కువ ఉందని పొలిటికల్(Political) విశ్లేషకులు చెప్తున్నారు. ఈనెల 3న ఫలితాల్లో(Results) కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించిన డీకే శివకుమార్(DK Shiva kumar).. పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. దానికంటే ముందు భట్టీ(Bhatti), ఉత్తమ్‌తో(Uttam) డీకే శివకుమార్ వేర్వేరుగా చర్చలు జరిపారు. సీఎంగా తమకు అవకాశాన్ని కల్పించాలని డీకే ముందు గట్టిగానే వాదించారు. తమకున్న అవకాశాలు, పార్టీలో తమ ప్రస్తానంపై వివరించారు. డీకే సమర్పించిన నివేదికపై ఖర్గే(Kharge) ఇంట్లో రాహుల్(Rahul gandhi), కేసీ వేణుగోపాల్(KC Venugopal) చర్చించారు. ఆ తర్వాత ఠాక్రే, డీకేతో మల్లిఖార్జున్‌ఖర్గే ఈ విషయంపై చర్చించారు. అనంతరం డీకే, ఠాక్రే నేరుగా హైదరాబాద్ బయలుదేరారు. సీఎం ఎవరనేది దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తోంది. డీకే శివకుమార్ హైదరాబాద్(Hyderabad) వచ్చాక సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే(Delhi) ఉన్న భట్టి, ఉత్తమ్.. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

అయితే ఢిల్లీలోనే ఉన్న ఉత్తమ్‌ మీడియా (Media)ప్రశ్నలకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. పార్టీలో తాను ఏడు సార్లు(7 Times) గెలిచానని, గత ఎన్నికల్లో పీసీసీ చీఫ్‌గా(PCC Chief) పనిచేశానన్నారు. సీఎం అభ్యర్థిగా ఇంత కంటే ఎవరు అర్హులన్న ధోరణిలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. బయట నుంచి పార్టీలోకి రాలేదని పరోక్షంగా రేవంత్‌(Revanth) గురించి ప్రస్తావించారు. 30 ఏళ్లుగా పార్టీలో నిజాయితీ, నిబద్ధతో పనిచేశానని, పార్టీకి లాయల్‌గా(Loyal) ఉంటూ వచ్చానని చెప్పారు. ఇదే విషయాలను అధిష్టానం ముందుంచానని.. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. తన ఎంపీ పదవికి కూడా ఉత్తమ్‌ రాజీనామా చేశారు. మరోవైపు ఢిల్లీలోనే భట్టి చాలా బలంగా తన వాదనలు వినిపిస్తున్నారు. 40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్నానని, తన కుటుంబం మొత్తం పార్టీకి అంకితమయ్యారని అంటున్నారు. దళిత(Dalit) వర్గానికి చెందిన తనని సీఎంగా ప్రకటిస్తే పార్టీకి ప్రయోజనంగా ఉంటుందని అధిష్టానం(High command) ముందు ప్రతిపాదనలు ఉంచారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయంపై సస్పెన్స్‌కు తెరదించాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే..!

Updated On 5 Dec 2023 7:11 AM GMT
Ehatv

Ehatv

Next Story