ఎవరి పిచ్చి వారికి ఆనందమని పెద్దలు ఊరికే అనలేదు. లేకపోతే యాక్సిడెంట్‌లో(Accident) తుక్కుతుక్కు అయిన కారును 15 కోట్లు(15 Crores) పెట్టి ఎవరైనా కొంటారా? చాదస్తం కాకపోతే...! ఆరో దశకంలో రేసింగ్‌లో(Racing) పాల్గొంటున్న సమయంలో ఫెరారీ కారు(Ferrari Car) మంటల్లో చిక్కుకుంది.

ఎవరి పిచ్చి వారికి ఆనందమని పెద్దలు ఊరికే అనలేదు. లేకపోతే యాక్సిడెంట్‌లో(Accident) తుక్కుతుక్కు అయిన కారును 15 కోట్లు(15 Crores) పెట్టి ఎవరైనా కొంటారా? చాదస్తం కాకపోతే...! ఆరో దశకంలో రేసింగ్‌లో(Racing) పాల్గొంటున్న సమయంలో ఫెరారీ కారు(Ferrari Car) మంటల్లో చిక్కుకుంది. ఆ మంటల్లో కాలిపోయి తుక్కుగా మారింది. ఇప్పుడా తుక్కు కారును వేలం వేశారు. ఇందులో ఆ కారును 1.8 మిలియన్‌ డాలర్లిచ్చి సొంతం చేసుకున్నాడో వ్యక్తి. మన కరెన్సీలో చెప్పాలంటే 15 కోట్ల రూపాయలన్నమాట! 1954లో ఈ ఫెరారీ 500 మాండియార్‌ స్పైడర్‌ సిరీస్‌-1(Ferrari 500 Mondiar Spider Series – 1) కారును తయారు చేశారు. ప్రముఖ ఇటాలియన్‌ రేసర్‌ అల్బర్టో అస్కరీ(Alberto Askari) ఫార్ములా వన్‌ వరల్డ్‌ డ్రైవర్స్‌ ఛాంపియన్‌షిప్‌లో సాధించిన విజయాలకు గుర్తుగా ఫెరారీ సంస్థ దీన్ని తయారు చేసింది.

అల్బర్టో అస్కరీ 1952, 1953లలో ఛాంపియన్‌గా నిలిచారు. 1954లో ఈ కారును రేసింగ్‌ డ్రైవర్‌ ఫ్రాంకో కోర్టెస్‌(Franco Cortes) కొన్నారు. తర్వాత 1958లో ఇది అమెరికాకు చేరుకుంది. 1960లలో ఓ రేసులో పాల్గొన్న ఈ కారు ప్రమాదానికి గురయ్యింది. మంటల్లో కాలిపోయింది. ఆ కాలిపోయిన కారునే ఇష్టపడి కొన్నారు చాలా మంది. 1978 వరకు ఇలా ఈ కారు పలువురి చేతులు మారుతూ వచ్చింది. పూర్తిగా ధ్వంసమైన స్టేజ్‌లో ఉన్న ఈ కారును ఓ వ్యక్తి కొని దాదాపు 45 ఏళ్లపాటు భద్రంగా చూసుకున్నాడు. ఇటీవల ఆర్‌.ఎం.సోథ్‌బీ సంస్థ ఈ కారును వేలం వేసింది. ఈ వేలంలో ఏకంగా 15 కోట్ల రూపాయలు పలికింది. కారును బాగుచేసి, మళ్లీ రేసింగ్‌ ట్రాక్‌పై తీసుకొస్తానని ఆ కారును సొంతం చేసుకున్న వ్యక్తి అంటున్నారు.

Updated On 21 Aug 2023 12:24 AM GMT
Ehatv

Ehatv

Next Story