అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అమెరికా న్యూయార్క్‌లో ఉంటున్న తెలంగాణ రాష్ట్రం.. వనపర్తి జిల్లాకు చెందిన దినేష్ (22), ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నికేష్(21)గా పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని దినేష్ స్నేహితులు తమకు ఫోన్ చేసి...సమాచారం ఇచ్చినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. వీరిద్దరూ ఒకే రూంలో ఉంటున్నట్టు తెలుస్తోంది.
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు(Telugu Students) అనుమానాస్పద స్థితిలో మృతిలో (Suspicious death) చెందారు. అమెరికా న్యూయార్క్(New York)లో ఉంటున్న తెలంగాణ రాష్ట్రం(Telangana State).. వనపర్తి జిల్లా(Vanaparthi District)కు చెందిన దినేష్(Dinesh), ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా(Andhra Pradesh Srikakulam district)కు చెందిన నికేష్(Nikesh)గా పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని దినేష్ స్నేహితులు తమకు ఫోన్ చేసి...సమాచారం ఇచ్చినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. వీరిద్దరూ ఒకే రూంలో ఉంటున్నట్టు తెలుస్తోంది. 2023 డిసెంబర్ 28న అమెరికా వెళ్లిన దినేష్ .. ఉన్నత చదువుల కోసం హార్ట్‌ఫోర్డ్ వర్శిటీ(Hartford University)లో చేరాడు. ఇటీవల అమెరికా వెళ్లిన నికేష్ కొంత మంది కామన్ ఫ్రెండ్స్ ద్వారా దినేష్ రూమ్‌మేట్ అయ్యాడు. అద్దెకుంటున్న ఇంట్లోనే ఇద్దరు యువకులు విగతజీవులుగా కనిపించటం సర్వత్రా అనుమానాలకు దారితీస్తున్నారు. వీరిద్దరి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. దినేష్ మృతదేహాన్ని తీసుకురావడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహాయం కోరినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. నికేష్ కుటుంబ సభ్యులతో తమకు ఎలాంటి పరిచయం లేదని, వారిద్దరూ ఇటీవలే అమెరికా వెళ్లారని చెబుతున్నారు. దినేష్ కుటుంబ సభ్యులను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శించారు. నికేష్ కుటుంబ సభ్యుల సమాచారం తెలియలేదని శ్రీకాకుళం పోలీసు చెబుతున్నారు. ఉన్న చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు అక్కడే చనిపోవడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎన్నో జాగ్రత్తలు చెప్పి భారంగానే సెండాఫ్ ఇచ్చిన పదిహేను రోజులకే..మీ కొడుకు చనిపోయాడంటూ వార్త రావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.