మండు వేసవిలో వర్షాలేమిటని అనుకున్నాం కదా! వానలు కురిసినన్ని రోజులు ఎంజాయ్‌ చేశాం కదా! చేసింది చాల్లే అనుకున్నాడు సూరీడు! ఇక నుంచి తన ప్రతాపాన్ని చవి చూడమంటూ హెచ్చరించాడు. అందుకే రాష్ట్రం ఒక్కసారిగా హీటెక్కింది. పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదవుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావాలతో గత పక్షం

మండు వేసవిలో వర్షాలేమిటని అనుకున్నాం కదా! వానలు కురిసినన్ని రోజులు ఎంజాయ్‌ చేశాం కదా! చేసింది చాల్లే అనుకున్నాడు సూరీడు! ఇక నుంచి తన ప్రతాపాన్ని చవి చూడమంటూ హెచ్చరించాడు. అందుకే రాష్ట్రం ఒక్కసారిగా హీటెక్కింది. పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదవుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావాలతో గత పక్షం రోజులుగా నడి వేసవిలోనూ సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ రోజులు ముగిశాయి. రాబోయే గ్రీష్మానికి సంకేతాలు మొదలయ్యాయి. రెండు రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయి. కరీంనగర్‌ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లా జైనలో గురువారం గరిష్ట ఉష్ణోగ్రత 44.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడిచెర్లలో 44.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా 40 డిగ్రీల సెల్సియస్‌ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదు కావొచ్చని వివరించింది.

Updated On 11 May 2023 10:49 PM GMT
Ehatv

Ehatv

Next Story