భారత రాష్ట్ర సమితి (BRS) అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam prasad kumar) సభలో ప్రకటన చేశారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భారత రాష్ట్ర సమితిని ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్పీకర్ మాట్లాడుతూ.. “భారత రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీని నేను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాను. మూడవ తెలంగాణ(Telangana) శాసనసభలో 39 మంది సభ్యుల బలంతో రెండవ అతిపెద్ద పార్టీగా బీఆర్ఎస్ ఉంది.
భారత రాష్ట్ర సమితి (BRS) అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam prasad kumar) సభలో ప్రకటన చేశారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భారత రాష్ట్ర సమితిని ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్పీకర్ మాట్లాడుతూ.. “భారత రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీని నేను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాను. మూడవ తెలంగాణ(Telangana) శాసనసభలో 39 మంది సభ్యుల బలంతో రెండవ అతిపెద్ద పార్టీగా బీఆర్ఎస్ ఉంది. తెలంగాణ మూడో శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) గుర్తింపు పొందారు అని స్పీకర్ అన్నారు.
శనివారం శాసనసభలో గవర్నర్ తమిళిసై(Tamilisai) సౌందరరాజన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ముందు ఈ ప్రకటన వెలువడింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గానూ 64 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్(Congress) రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోగా.. దాని మిత్రపక్షమైన సీపీఐ(CPI) ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎనిమిది స్థానాల్లో బీజేపీ(BJP), ఎంఐఎం(MIM) ఏడు స్థానాలను దక్కించుకున్నాయి.