తెలంగాణలో(Telangana) ఉష్ణోగ్రతలు(Temperatures) పెరుగుతున్నాయి. చూస్తూ ఉంటే ఈ ఎండకాలం భరించలేనంత ఉష్ణోగ్రతలు ఉంటాయేమోననిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.బుధవారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. రానున్న అయిదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చు. ఇంతకు ముందే ఈ విషయాన్ని వాతావరణ నిపుణులు చెప్పారు.
తెలంగాణలో(Telangana) ఉష్ణోగ్రతలు(Temperatures) పెరుగుతున్నాయి. చూస్తూ ఉంటే ఈ ఎండకాలం భరించలేనంత ఉష్ణోగ్రతలు ఉంటాయేమోననిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.బుధవారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. రానున్న అయిదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చు. ఇంతకు ముందే ఈ విషయాన్ని వాతావరణ నిపుణులు చెప్పారు. ఈ ఏడాది వేసవిలో ఎండలు, వడగాడ్పుల(Heat waves) తీవ్రత అధికంగా ఉంటుందని, గత ఏడాది కంటే మరింత తీవ్రమైన వేసవిని(Summer) చూడకతప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో(Pacific Ocean) ఎల్‌నినో(El Nino) తీవ్రంగా ఉన్న కారణంగా వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ఏప్రిల్ తర్వాత ఎల్‌నినో బలహీనపడి ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గవచ్చట! ఆ క్రమంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారి సెప్టెంబర్ నుంచి పసిఫిక్ మహాసముద్రంలో లానినా ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీని వల్ల నైరుతి రుతుపవన వర్షాలు విస్తారంగా కురుస్తాయని అక్టోబర్ చివరినాటికి అరవై శాతం లానినా పరిస్థితులు ఏర్పడతాయని, శీతాకాలంలో తీవ్రమైన చలి ఉంటుందని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOVA) అంచనా వేసింది.