టీఎస్ఆర్టీసీ(TSRTC) విలీనం బిల్లుపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundhar Rajan) సమ్మతించారు. బిల్లుపై తొలుత గవర్నర్ పలు సందేహాలు లేవనెత్తారు

Breaking News
టీఎస్ఆర్టీసీ(TSRTC) విలీనం బిల్లుపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundhar Rajan) సమ్మతించారు. బిల్లుపై తొలుత గవర్నర్ పలు సందేహాలు లేవనెత్తారు. దీంతో సభలో ప్రవేశపెట్టడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో రవాణాశాఖ అధికారులతో రాజ్‌భవన్‌లో(Raj bhavan) తమిళిసై సమావేశమయ్యారు. లేవనెత్తిన సందేహాలపై రవాణశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు గవర్నర్‌కు వివరణ ఇచ్చారు. సమావేశం అనంతరం బిల్లుకు తమిళిసై ఓకే చెప్పారు. దీంతో ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అయింది.
గవర్నర్ గ్రీన్ సిగ్నల్‌తో టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం దిశగా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. కాసేపట్లో సభ ముందుకు ఆర్టీసీ విలీన బిల్లు రానుంది.
