త్వరలోనే తెలంగాణ రైతులకు మరో శుభవార్తను కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt) అందించబోతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే రైతుల రుణాల మాఫీపై (Farmers loan waiver)పై నిర్ణయం ప్రకటిస్తుందని తెలుస్తుంది.

త్వరలోనే తెలంగాణ రైతులకు మరో శుభవార్తను కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt) అందించబోతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే రైతుల రుణాల మాఫీపై (Farmers loan waiver)పై నిర్ణయం ప్రకటిస్తుందని తెలుస్తుంది. ఈ పథకానికి రూ.32 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. అందుకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తూ రేవంత్‌ సర్కార్‌ (Revanth Sarkar) నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో 30 లక్షలకుపైగా రైతులు లబ్ధిపొందుతారని లెక్కలు చెప్తున్నాయి. ఈ మేరకు అసలు, వడ్డీ కలిపి ఒక్కో రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులకు ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని ఇందుకు సంబంధించిన వ్యవహారాలను అధికారులు చక్కబెడుతున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ వచ్చేలోగానే రెండు లక్షల రుణమాఫీపై నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Updated On 9 Jan 2024 11:46 PM GMT
Ehatv

Ehatv

Next Story