తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన అబ్దుల్లా పూర్ మెట్టు (Abdullapurmet) నవీన్ మర్డర్ కేసులో (Naveen Murder Case)మూడవ నిందితురాలుగా ఉన్న నిహారిక రెడ్డికి (Niharika Reddy)కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన అబ్దుల్లా పూర్ మెట్టు (Abdullapurmet) నవీన్ మర్డర్ కేసులో (Naveen Murder Case)మూడవ నిందితురాలుగా ఉన్న నిహారిక రెడ్డికి (Niharika Reddy)కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నిహారికకి ఇంత త్వరగా బెయిల్ ఎలా వస్తుందంటూ అబ్దుల్లా పూర్ మెట్ డిసిపి ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు మృతుడు నవీన్ కుటుంబ సభ్యులు.
హత్యకు ప్రధాన కారణమైనటువంటి నిందితురాలు నిహారిక అని హత్య చేసి వచ్చిన వారికి అవాసం ఇచ్చి స్నానం చేయడానికి బట్టలు మార్చుకోవడానికి తన ఇంటికి తీసుకుని వెళ్లి హరిహర కృష్ణ (Hari Hara Krishna) పారిపోవడానికి 1500 రూపాయలు డబ్బులు ఇచ్చిన నిందితురాలు కి ఇంత త్వరగా జైలు నుండి బయటకు రావడం ఏంటని నిందితులను ఉరితీయాలని మృతుడు నవీన్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు, తమకు న్యాయం చేయాలని డిసిపి ఆఫీసు ముందు బయటయించారు. కనీసం నెల రోజులు కాకుండానే 12 రోజుల్లో బెయిల్ ఎలా వచ్చిందంటూ ఏం సెక్షన్ లో పెట్టారో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తమ బిడ్డను క్రూరాతి క్రూరంగా హింసించి చంపేందుకు నిహారిక హరిహర కృష్ణకు పూర్తి సహాయం చేసిందని, హత్య చేయాలనే ఐడియాను నిహారికే చెప్పిందని తెలిపారు.. నిందితులను వెంటనే శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.