వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీలో చేరిన పది రోజులకే ఆయన యూటర్న్ తీసుకోవడంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఇదే అంశంపై 'అంబటి రాయుడికి టీడీపీ థాంక్స్.. జగన్ వంటి నేతతో కలసి పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడనందుకు ధన్యవాదాలు' అంటూ టీడీపీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా(Ambati Rayudu's resignation) చేయడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీ(ysrcp)లో చేరిన పది రోజులకే ఆయన యూటర్న్ తీసుకోవడంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీని వీడుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయాలకు ఇది తాత్కాలిక విరామం మాత్రమేనని..తర్వలోనే భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తానని చెప్పారు. మరోవైపు రాయుడు రాజీనామా ట్వీట్ పై ప్రతిపక్ష టీడీపీ స్పందించింది. 'అంబటి రాయుడికి బెస్ట్ విషెస్.. జగన్ వంటి నేతలతో కలసి పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడనందుకు ధన్యవాదాలు.. మీకు భవిష్యత్‌లో మంచి జరగాలని కోరుకుంటున్నాము' అంటూ అంబటిని ట్యాగ్ చేస్తూ టీడీపీ ట్వీట్(TDP tweet) చేసింది. ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ మారింది.

Updated On 6 Jan 2024 1:52 AM GMT
Ehatv

Ehatv

Next Story