TDP silent: షర్మిల విమర్శలపై టీడీపీ మౌనం..అందుకోసమేనా ?
ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన రోజే..షర్మిల అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విర్శలు చేశారు. రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ఆరోపణలు, విమర్శలు చేయడం సర్వసాధారణం. కానీ..పీసీసీ పగ్గాలు చేపట్టిన మొదటి రోజే సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇదంతా కాంగ్రెస్ పెద్దలతోపాటు మరికొందరి మెపుుకోసమేననే ప్రచారం పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది.
ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన రోజే..వైెె ఎస్ షర్మిల (Ys Sharmila) అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విర్శలు చేశారు. రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ఆరోపణలు, విమర్శలు చేయడం సర్వసాధారణం. కానీ..పీసీసీ పగ్గాలు చేపట్టిన మొదటి రోజే సీఎం జగన్(Cm Jagan) పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇదంతా కాంగ్రెస్ పెద్దలతోపాటు మరికొందరి మెపుుకోసమేననే ప్రచారం పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు(Opposition leader Chandrababu)పై కూడా షర్మిల ఘాటైన విమర్శలే చేశారు. చంద్రబాబును బీజేపీ తొత్తుగా అభివర్ణించారు. రాజధాని అమరావతిని సింగపూర్ చేస్తానని నమ్మించి ప్రజలను మోసం చేశారని ఆరోపించిన షర్మిల.. చివరికి గ్రాఫిక్స్‌తో సరిపెట్టారని షర్మిల మండిపడ్డారు. పదేళ్లలో ఏపీ ప్రజలను నిండా ముంచారని అన్నారు. ఏపీని అప్పుల్లో ముంచెత్తిన పాపంలో చంద్రబాబు పాత్ర కూడా ఉందన్నారు. టీడీపీ, వైసీపీ దొందు దొందేనని షర్మిల విరుచుకుపడ్డారు. అయితే షర్మిల విమర్శలపై వైసీపీ వెంటనే స్పందించింది. వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో సమాధానం వచ్చింది. కానీ..టీడీపీ నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా షర్మిల విమర్శలపై స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందం ఉండటం వల్లే షర్మిల కామెంట్స్ పై టీడీపీ నేతలు స్పందించడం లేదనే చర్చ నడుస్తోంది. సీఎం వైఎస్ జగన్‌ను ఎలాగైనా గద్దె దింపడానికే వైఎస్ షర్మిలను చివరి అస్త్రంగా చంద్రబాబు ప్రయోగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ పరిణామాలను చూస్తే.. చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అనే విమర్శలకు బలం చేకూరుతోంది. అలా లేకపోయి ఉంటే.. షర్మిల అంత ఘాటైన విమర్శలు చేసినా..టీడీపీ నేతలు ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదన్నఅందరిలో కలుగుతోంది. అందుకే.. షర్మిల విమర్శల వెనుక చంద్రబాబు ఉన్నారనే చర్చ సర్వత్ర జోరుగా సాగుతోంది.