TDP-JanSena seats: సీట్ల సర్దుబాటుకు ముందే సిగపట్లు..సయోధ్య ఎలా?
టీడీపీ-జనసేన కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే ఆ పార్టీ అధినేతలు స్పష్టం చేశారు. అయితే..ఎవరికి ఎన్ని సీట్లు , ఎక్కడ పోటీ చేయాలనే పంచాయతీ ఇంకా పెండింగ్లోనే ఉంది. కొన్ని చోట్ల టీడీపీ స్థానాలపై జనసేన నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆ సీట్లు జనసేనకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. పొత్తు ధర్మాన్ని పాటించాలని టీడీపీకి సూచిస్తున్నారు జనసేన నేతలు. తాజాగా తిరుపతి సీటు తమకే కేటాయించాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. దీంతో సీట్ల సర్దుబాటుకు ముందే సిగపట్లు మొదలయ్యాయనే ప్రచారం జరుగుతోంది.

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే జనసేన, టీడీపీ పొత్తు( TDP Jana Sena alliance)లో వెళ్లాలని నిర్ణయించుకున్నా..సీట్ల సర్దుబాటు(Seat adjustment)పై క్లారిటీ రాలేదు. చాలా చోట్ల టీడీపీ స్థానాలపై జనసేన ఆశలు పెట్టుకోగా..గతంలో జనసేన పోటీ చేసి ఓడిపోయిన స్థానాలను టీడీపీకి కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు ముందే సిగపట్లు తప్పడం లేదు. ముఖ్యంగా గెలుపే ప్రామాణికంగా సీట్లు, నియోజకవర్గాలను ఎంపిక చేసుకోవాలి. కానీ..రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంత సులువుగా కనిపించడం లేదు. గతంలో జనసేనలో పట్టుమని పది మంది కూడా అభ్యర్థులు ఉండేవారు కాదు. కేవలం.. ఉభయగోదావరిజిల్లాల్లో మాత్రమే ఆ పార్టీకి నాయకత్వం కనిపించేంది. కానీ..ఇటీవల ఇతర పార్టీల నుంచి జనసేనలో చేరిపోయారు. దీనికి కారణం..జనసేనలో చేరితే కనీసం టికెటైనా వస్తుందని వారి నమ్మకం. దీంతో వలసల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకరో..ఇద్దరో బలమైన నాయకులు జనసేనలో కనిపిస్తు్న్నారు. తాజాగా తిరుపతి టికెట్ పై పంచాయతీ మొదలైంది. తిరుపతి టికెట్ తమకంటే తమకని పోటీపడుతున్నాయి. ఇక్కడ బలిజ సమాజికవర్గానికి గెలుపోటములను ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. జనసేన మన పార్టీ అనే భావన వారిలో ఉంది. పొత్తులో భాగంగా ఈ సీటును ఎవరికి కేటాయిస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. అధికార వైసీపీ తిరుపతి అభ్యర్థి(Tirupati YCP candidate) గా డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ (Deputy Mayor Bhumana Abhinay) ఇక్కడి నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. కానీ..ప్రతిపక్షాల అభ్యర్థి ఎవరనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. గతంలో తిరుపతి నియోజకవర్గం(Tirupathi Constituency) నుంచి మెగస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గెలిచి చట్టసభలో అడుగుపెట్టారు. దీంతో తిరుపతి సీటు తమకే కేటాయించాలని జనసేన పట్టుబడుతోంది. బలిజల మెజార్టీ ఎక్కవగా ఉండటంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు జనసేన నేతలు. జనసేనకు టికెట్ ఇస్తే, ఎవరిని నిలబెట్టినా గెలిపించి తీరుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తిరుపతి సీటు జనసేనకు ఇవ్వకపోతే..ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతం వెళ్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. గతంలో పవన్ కల్యాణ్ (Pavan Kalyan) పోటీ చేసి ఓడిపోయిన గాజువాక(Gajuwaka), భీమవరం సీట్ల(Bheemavaram Seats)ను టీడీపీకి కేటాయించాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో సీట్ల సర్దుబాటు ఎలా సర్దుబాటు చేసుకుంటారనేదానిపై రెండు పార్టీల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.