విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ బిగ్ షాకిచ్చింది. ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వడం లేదని తేల్చేసింది. విజయవాడ ఎంపీ టికెట్ మరొక్కరికి కేటాయిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇంఛార్జీల మార్పుతో అధికార వైసీపీలో రచ్చ జరుగుతుండగా..తాజాగా ప్రతిపక్ష టీడీపీలో సీట్ల చిచ్చు మొదలైంది. తాజాగా సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి ఈ సారి ఎన్నికల్లో సీటు లేదని తేల్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీంతో నాని ఆ పార్టీలో కొనసాగుతారా..లేదా? అనేదానిపై విజయవాడ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.

విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ బిగ్ షాక్(big shock to Keshinen) ఇచ్చింది. ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వడం లేదని తేల్చేసింది. విజయవాడ ఎంపీ టికెట్ మరొక్కరికి కేటాయిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇంఛార్జీల మార్పుతో అధికార వైసీపీ(ycp)లో రచ్చ జరుగుతుండగా..తాజాగా ప్రతిపక్ష టీడీపీ(tdp)లో సీట్ల చిచ్చు మొదలైంది. తాజాగా సిట్టింగ్ ఎంపీ కేశినేని(MP Keshineni) నానికి ఈ సారి ఎన్నికల్లో సీటు లేదని తేల్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు(tdp chief chandrababu). దీంతో నాని ఆ పార్టీలో కొనసాగుతారా..లేదా? అనేదానిపై విజయవాడ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. ఇప్పటి వరకు అధికార వైసీపీలోనే టిక్కెట్ల రగడ చూస్తున్నాం. తాజాగా టీడీపీలోనూ సీట్ల రచ్చ మొదలైంది. తాజాగా సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని(Sitting MP Keshineni Nanii)కి టిక్కెట్ లేదని తేలిపోయింది. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పేశారు. పార్టీ కార్యక్రమాల్లో అంతగా జోక్యం చేసుకోవద్దని చెప్పటం ద్వారా దాదాపుగా నానిని పక్కన పెట్టినట్టేనని అర్థమవుతోంది. అయితే తనకు టికెట్ ఇచ్చినా..ఇవ్వకపోయినా..చంద్రబాబు వెంటే ఉంటానన్నారు ఎంపీ కేశినేని నాని. ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. నాని మద్దతు దారులు మాత్రం టీడీపీ నిర్ణయాన్ని అవమానంగా భావిస్తున్నారు. దీంతో ఆయన పార్టీలో కొనసాగడం సందేహంగానే ఉంది. దీంతో నాని టీడీపీలో కొనసాగుతారా..లేదా? ఒకవేళ నాని పార్టీ వీడితే.. ఆయన అడుగులు ఎటువైపు ? అనేదానిపై బెజవాడ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. అయితే టికెట్ రాకపోతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. కేశినేని నానికి గతంలోనే వైసీపీ(ycp)లో చేరేందుకు ఆఫర్ వచ్చింది. ఇప్పుడు టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తు(TDP, JanaSena, BJP alliance) ఖాయమని భావిస్తున్న వేళ వైసీపీ వైపు చూస్తారా..లేక స్వతంత్రంగానే బరిలో నిలుస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇక, అటు నానిని పక్కన పెడుతూనే.. చిన్నికి బాధ్యతలు అప్పగించారు. కొంత కాలంగా చిన్ని ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు తాజా నిర్ణయంతో చిన్నికి (chinni) ఎంపీగా పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయినట్టేనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Updated On 5 Jan 2024 12:47 AM GMT
Ehatv

Ehatv

Next Story