సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు వైద్యులు హెల్త్ బులిటెన్ లో ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు ఐసీయూలోనే వైద్యం అందిస్తున్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రంఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు ఐసీయూలోనే వైద్యం అందిస్తున్నారు. ఊపిరితిత్తుల నుంచి నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు వైద్యులు. మంగళవారం ఉదయం ఖమ్మం రూరల్ మండలంలోని తన స్వగ్రామమైన తెల్దారుపల్లి ఉన్న సమయంలోనే తీవ్రంగా ఛాతిలో నొప్పి వచ్చింది. శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఖమ్మం సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మెడికల్ టెస్టులు నిర్వహించిన వైద్యులు మైల్డ్ గా స్ట్రోక్ వచ్చినట్లు గుర్తించారు. వారి సూచన మేరకు నిన్న సాయంత్రం.. వెంటిలేటర్ సాయంతో హైదరాబాద్ తీసుకొచ్చి.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్లు.. గుండె, కిడ్ని, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డీఎన్ కుమార్ గైడెన్స్ లో ఐసీయూలో వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేనిని సీపీఎం రాష్ట్ర నాయకులు పరామర్శించారు. తమ్మినేనికి విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినందువల్ల కార్యకర్తలు ఎవరూ ఆస్పత్రికి రావద్దని ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేసారు. అలాగే..ఈ నెల 17,18 తేదీల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగాల్సిన సీపీఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.