నది(River) అంటే అందరికీ గౌరవమే! నదిని తల్లిగా పిలుచుకుంటాము. అమ్మగా కొలుచుకుంటాము. జలదేవతను ఆరాధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.. మనకు మైసమ్మ(Maisamma) ఉన్నట్టుగానే తమిళులకు పచ్చై అమ్మన్(Pachai Amman) ఉంది! ఆమె జలదేవత! వర్షరుతువు ఆరంభంలో .వ్యవసాయపనులు మొదలవుతున్న వేళ ఆమెకు పూజలు చేస్తారు. నదులు, చెరువుల దగ్గరకు వెళ్లి తనివితీరా మొక్కుకుంటారు.
నది(River) అంటే అందరికీ గౌరవమే! నదిని తల్లిగా పిలుచుకుంటాము. అమ్మగా కొలుచుకుంటాము. జలదేవతను ఆరాధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.. మనకు మైసమ్మ(Maisamma) ఉన్నట్టుగానే తమిళులకు పచ్చై అమ్మన్(Pachai Amman) ఉంది! ఆమె జలదేవత! వర్షరుతువు ఆరంభంలో .వ్యవసాయపనులు మొదలవుతున్న వేళ ఆమెకు పూజలు చేస్తారు. నదులు, చెరువుల దగ్గరకు వెళ్లి తనివితీరా మొక్కుకుంటారు.
వర్షరుతువు రాగనే అప్పటి వరకు బీడువారిన నేల ఆకుపచ్చటి రంగును సింగారించుకుంటుంది. సెగలొచ్చి, పొగలొచ్చి సొగసిన నేల కొత్త అందాలను సంతరించుకుంటుంది. వర్షరుతువు కోసం సకల జీవాలు ఎదురుచూసేది అందుకే! వర్షరుతువు ఆగమనాన్ని పండుగ చేసుకునేది అందుకే! తమిళ ప్రజలు ఆది మాసపు పద్దెనిమిదో రోజున మాన్‌సూన్ ఫెస్టివల్‌ను చాలా గొప్పగా జరుపుకుంటారు. ఆ పండుగ పేరు ఆది పెరుక్కు. ఆ రోజున సమస్త మానవాళికి సుఖ సంతోషాలను, సంపదలను ఇచ్చే నదీమతల్లికి ప్రణమిల్లుతారు.
నదికి పూజలు చేస్తారు.. అందరిని చల్లగా చూడమని వేడుకుంటారు. నదీ తీరాలకు జలాలకు ఆదిదేవత అయిన అమ్మవారిని కొలుచుకుంటారు.. నదుల దేవతను వారు పచ్చై అమ్మన్‌గా పిలుచుకుంటారు. మన దగ్గర గ్రామదేవతలు ఉన్నట్టుగానే తమిళనాడులో పల్లెపల్లెన పచ్చైఅమ్మన్ గుడి కనిపిస్తుంది.. కొన్ని ప్రాంతాలవారు అమ్మవారిని కన్ని అమ్మన్‌గా(Kanni Amman) పూజించుకుంటారు. పెళ్లి కాని వారు ఆమెను ఆరాధిస్తే కల్యాణ ఘడియలు వచ్చేస్తాయన్నది అక్కడివారి నమ్మకం.
తిరుముల్లయ్‌వాయల్‌లో పచ్చై అమ్మన్ ఆలయం ఉంది.. ఆలయ కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోవడమే కాదు.. దీర్ఘ వ్యాధుల నుంచి స్వస్తత లభిస్తుందట!
ఈ ఏడాది ఆదిపెరుక్కు పండుగ గురువారం జరిగింది. ప్రజలు నదుల చెంతకు చేరి పూజలు చేశారు.. అమ్మాయిలు నదిలో దీపాలను వదిలారు. నది చెంతన లేని వారు సమీపంలో ఉన్న సరస్సు. చెరువులను పూజించారు. నీరు సమృద్ధిగా దొరికేట్టు చేయమని అమ్మవారిని వేడుకున్నారు. తాగు, సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రార్థించారు.
ఆది పెరుక్కు అన్నా ఆది పిరప్పు అన్నా.. పదినెట్టామ్ పెరుక్కు అన్నా ఒకటే! ఇది ప్రకృతి పండుగ.. ప్రకృతి దేవతను ఆరాధించే వేడుక.. మహిళల సంబరం ఇది! కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.. వ్యవసాయపనులు మొదలయ్యే వేళ ఈ పండుగ వస్తుంది.. అందుకే ఈ పండుగకు అంత ప్రత్యేకత! పంటలు సమృద్ధిగా పండాలని జలదేవతను ప్రార్థిస్తారు.. పొంగల్ నాటికి ఇంటికి ధాన్యరాశులు చేరాలని కోరుకుంటారు. పొంగల్‌ను ఎంత ఘనంగా జరుపుకుంటారో ఈ ఆది పెరుక్కును కూడా అంతే గొప్పగా జరుపుకుంటారు.. పిండివంటలు చేసుకుంటారు.. కొబ్బరిపాలతో పాయసం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు..