విద్యా ఫిలిప్పోన్ అనే స్విస్‌ మహిళ ముంబైలో(Mumbai) గత దశాబ్దకాలంగ తన తల్లి కోసం అన్వేషిస్తుంది. ఇందుకు విద్యా ఫిలిప్పోన్ వద్ద ఉన్న ఆధారాలు ఆమె తల్లిపేరు, చిరునామా కలిగి ఉంది. విద్యా ఫిలిప్పోన్ ఫిబ్రవరి 8, 1996న జన్మించింది. ఆమెను ఆమె తల్లి మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీలో(Missionaries of charity) వదిలివెళ్లింది. అక్కడి నుంచి విద్యా ఫిలిప్పోన్‌ను 1997లో స్విస్‌ దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెను స్విట్జర్లాండ్‌కు తీసుకెళ్లారు.

విద్యా ఫిలిప్పోన్(Vidhya Philippon) అనే స్విస్‌ మహిళ ముంబైలో(Mumbai) గత దశాబ్దకాలంగ తన తల్లి కోసం అన్వేషిస్తుంది. ఇందుకు విద్యా ఫిలిప్పోన్ వద్ద ఉన్న ఆధారాలు ఆమె తల్లిపేరు, చిరునామా కలిగి ఉంది. విద్యా ఫిలిప్పోన్ ఫిబ్రవరి 8, 1996న జన్మించింది. ఆమెను ఆమె తల్లి మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీలో(Missionaries of charity) వదిలివెళ్లింది. అక్కడి నుంచి విద్యా ఫిలిప్పోన్‌ను 1997లో స్విస్‌ దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెను స్విట్జర్లాండ్‌కు తీసుకెళ్లారు.

విద్యాఫిలిప్పోన్ ఇప్పుడు ముంబైలోని తన మూలాలను కనుగొనేందుకు తిరిగి భారతదేశానికి వచ్చారు. 10 ఏళ్లుగా తన తల్లి(Mother) కోసం విద్యాఫిలిప్పోన్‌ అన్వేషిస్తోంది. ముంబైలోని తన మూలాలను వెతుక్కుంటూ మదర్ థెరిసా మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీని సందర్శించి తన తల్లి కోసం విచారణ చేసింది. తనను వదిలి వెళ్లిన ఆ మహిళ దహిసర్‌(Dahisar) ప్రాంతంలో నివాసం ఉంటుందని చెప్పగా.. దహిసర్‌ ప్రాంతాన్ని కూడా సందర్శించింది. అయినా ఆమెకు తన తల్లి ఆచూకీ లభించలేదు. తల్లి ఆచూకీ కోసం విద్యాఫిలిప్పోన్‌కు సాయం చేస్తున్న అడాప్టీ రైట్స్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ అడ్వకేట్‌ అంజలి పవార్‌(Anjali power) మాట్లాడుతూ ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దాదాపు 26 ఏళ్ల క్రితం ఉన్న అడ్రస్‌లో ఆ మహిళ ఉండడం లేదని.. మరో చోటుకు వెళ్లి ఉండవచ్చాని అన్నారు. విద్యా ఫిలిప్పోన్‌ తల్లి ఆచూకీ కనుగొనేందుకు సాయం చేస్తామని అంజలి పవార్‌ అన్నారు.

దీనిపై విద్యాఫిలిప్పోన్‌ మాట్లాడుతూ.. నాకు జన్మనిచ్చినప్పుడు మా అమ్మ వయస్సు 20 సంవత్సరాలు, నేను ఆమె కోసం 10 సంవత్సరాలుగా వెతుకుతున్నా. నేను నా భర్తతో(Husband) కలిసి భారతదేశానికి వచ్చా. నా కుటుంబం ఇంటిపేరు కాంబ్లీ(Kambli). ముంబై వాసులు మా అమ్మను కనుగొని, ఆమె గురించి నాకు సమాచారం అందించాలని ఆమె కోరింది.

Updated On 21 Dec 2023 2:38 AM GMT
Ehatv

Ehatv

Next Story