అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడదని, ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను సుప్రీంకోర్టు జడ్జి దృష్టికి న్యాయవాది సుందరం తీసుకెళ్లారు.

అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడదని, ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను సుప్రీంకోర్టు జడ్జి దృష్టికి న్యాయవాది సుందరం తీసుకెళ్లారు. కోర్టులో నడుస్తున్న కేసును రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎలా మాట్లాడుతాడు? ఉప ఎన్నికలు రావని రేవంత్ రెడ్డి ఎలా అంటాడు? అని కోర్టులో వాదనలు వినిపించారు. ఇంతకు ముందు కూడా ఇలా న్యాయస్థానానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు, మళ్లీ మళ్లీ అలానే రిపీట్ చేస్తున్నాడు అంటూ రేవంత్ రెడ్డిపై సీరియస్ జస్టిస్ బీఆర్ గవాయ్ అయ్యారు.

పార్టీ ఫిరాయింపులపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్‌కు సర్వాధికారాలున్నాయని స్పీకర్‌ తరపు న్యాయవాది రోహత్గి వాదనలు వినిపించారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. స్పీకర్ ఇంకో నాలుగేళ్లు ఏం నిర్ణయం తీసుకోకుండా ఉంటే న్యాయస్థానాలు అలానే చేతులు కట్టుకొని కూర్చోవాలా అని ప్రశ్నించారు. స్పీకర్ తరపు న్యాయవాదిపై న్యాయమూర్తి గవాయ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్‌ను విచారణకు పిలిచిన విషయం మర్చిపోవద్దని జస్టిస్ బీఆర్ గవాయ్ హితవు పలికారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది.

ehatv

ehatv

Next Story