గర్భంలో ఉన్న శిశువుకు కూడా జీవించే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 20 ఏళ్ల ఓ అవివాహిత తన 27 వారాల గర్భం తొలగించుకోవడానికి వేసిన పిటిషన్‌ను అత్యన్నత న్యాయస్థానం తిరస్కరిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. ఇంతకు ముందు తన గర్భం తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆ యువతి చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.

గర్భంలో ఉన్న శిశువుకు కూడా జీవించే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 20 ఏళ్ల ఓ అవివాహిత తన 27 వారాల గర్భం తొలగించుకోవడానికి వేసిన పిటిషన్‌ను అత్యన్నత న్యాయస్థానం తిరస్కరిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. ఇంతకు ముందు తన గర్భం తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆ యువతి చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు కూడా ఆమె విన్నపాన్ని తిరస్కరించింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం కీలక తీర్పిచ్చింది. ఈ సందర్భంగా యువతి తరపు న్యాయవాదికి ధర్మాసనం కొన్ని ప్రశ్నలను సంధించింది. గర్భంలో ఉన్న శిశువుకు కూడా జీవించే హక్కు ఉంటుంది. కాదంటారా అని యువతి తరఫు న్యాయవాదిని ప్రశ్నించినప్పుడు మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం కేవలం తల్లి గురించి మాత్రమే చెబుతున్నదని జవాబిచ్చారు. ఇప్పుడు గర్భం ఏడు నెలలు దాటిందని, గర్భస్త శిశువుకు ఉన్న బతికే హక్కుపై ఏమంటారు ధర్మాసనం అడిగితే శిశువు జన్మించేవరకు అది తల్లి హక్కే తప్ప శిశువుకు ప్రత్యేక హక్కులేమీ ఉండవని న్యాయవాది తెలిపారు. యువతి మానసికంగా చిత్రవధను అనుభవిస్తున్నారని, ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉందని యువతి తరపు న్యాయవాది చెబుతూ ఆమె ప్రస్తుతం నీట్‌ పరీక్ష క్లాసులు తీసుకుంటున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె సమాజానికి ముఖం చూపించలేకపోతున్నారని, యువతి మానసిక, శారీరక పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలని న్యాయవాది కోర్టును కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం ‘సారీ’అని సమాధానమిచ్చింది. అమ్మాయి, ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉన్నారని ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేసిన మెడికల్‌ బోర్డు ఇప్పటికే సర్టిఫై చేసింది. 24 వారాలు దాటిన గర్భం తీయించుకోవాలంటే తల్లికి, శిశువుకుగాని ఆరోగ్యపరంగా ఏదైనా హాని ఉంటేనే మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్ట్‌ కింద అనుమతిస్తారు.

Updated On 17 May 2024 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story