తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్ల కొట్టివేతను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు, మధ్యంతర నివేదిక తెప్పించుకుంది.

తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్ల కొట్టివేతను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు, మధ్యంతర నివేదిక తెప్పించుకుంది. కంచె గచ్చిబౌలిలో చెట్ల కొట్టివేతను తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. అన్ని పనులు తక్షణం ఆపాలని.. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది చాలా సీరియస్ విషయమని.. 100 ఎకరాలు ధ్వంసం చేసినట్లు నివేదిక వచ్చిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు రిజిస్ట్రార్ స్పాట్‌కు వెళ్లి రిపోర్టు ఇచ్చారు, ఆ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్నామని తెలిపింది. ఈ కేసులో తెలంగాణ సీఎస్‌ను సుప్రీంకోర్టు ప్రతివాదిగా చేర్చింది. నెల రోజుల్లోగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అది ఫారెస్ట్ ల్యాండ్ కాదన్న సర్కార్ తరపుపై జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవి అయినా కాకపోయినా, చెట్లను నరికివేయడానికి మీరు అనుమతి తీసుకున్నారా... 2-3 రోజుల్లో 100 ఎకరాలు అనేది మామూలు విషయం కాదు, ఒకరు ఎంత ఉన్నతుడైనా, చట్టానికి అతీతంగా కాదని వ్యాఖ్యానించారు. తమ ఆదేశాలను పాటించకుంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారు మరియు వారిపై చర్యలు తీసుకుంటారు.
