Summer Effect : మండుతున్న ఎండలు..42 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) ఎండలు దంచికొడుతున్నాయి. మండుతున్న ఎండలతో ఉష్ణోగ్రలు సాధారణం కంటే అత్యధికంగా నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంట నుంచి సాయంత్ర 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నెల 7 నుంచి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) ఎండలు దంచికొడుతున్నాయి. మండుతున్న ఎండలతో ఉష్ణోగ్రలు సాధారణం కంటే అత్యధికంగా నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంట నుంచి సాయంత్ర 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నెల 7 నుంచి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లా(Nirmal District) దస్తూరాబాద్ లో 42.8 డిగ్రీలు, నాగర్ కర్నూలుజిల్లా కొల్హాపూర్లో 42.7 డిగ్రీలు, ఖమ్మంజిల్లా నేలకొండపల్లిలో 42.5 డిగ్రీలు, గద్వాలజిల్లా ఆలంపూర్ లో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు, భూపాలపల్లిజిల్లా మహదేవ్పూర్ లో 42.4 డిగ్రీలు నమోదయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్(AP)లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సింగాడంలో 41.3 డిగ్రీలు, ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో 40.5 డీగ్రీలు, అనకాపల్లిలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు, నెల్లూరుజిల్లా కందుకూరులో 40.2 డిగ్రీలు, నంద్యాలజిల్లా గోస్పాడులో 40.2 డిగ్రీలు, కడపలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఒకరోజు వ్యవధిలోనే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోత, వేడికి తట్టుకోలేక జనం ఫ్యాన్లు, వాటర్ కూలర్లు, ఏసీలను ఎక్కువ సమయం వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోయింది. గ్రామాల్లో కూలీలు సైతం వేడిని తట్టులేక మధ్యాహ్నమే ఇళ్లకు చేరుకుంటున్నారు. విద్యాసంస్థలు ఒంటిపూట బడిని నిర్వహిస్తుండటంతో విద్యార్థులు ఎండబారిన పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో రద్దీగా ఉండే ప్రధాన రహదారులు సైతం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్ర 4 వరకు జనం రాకపోకలు తగ్గిపోతున్నాయి. కొనుగోలుదారులు లేక మధ్యాహ్నం సమయంలో వ్యాపార సముదాయాలు వెలవెలపోతున్నాయి. సాయంత్రం మాత్రమే వ్యాపార సముదాయాల దగ్గర జనం రద్దీ కనిపిస్తోంది. ఎండ తాపాన్ని తట్టుకోలేక జనం శీలల పానీయాలు, చెరుకురసం, కొబ్బరినీళ్లను సేవిస్తున్నారు. మూడు రోజులపాటు వడగాలులు కూడా ఉంటాయన్న వాతావరణ సమాచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏప్రిల్ నెల రెండో వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే మే నెలలో ఎండలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికితోడు ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తోంది.