ఆరు గ్యాంటీల(six guarantees)ను పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు 100 రోజుల్లో ఈ టాస్క్ ను పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(cm revanth reddy) నిర్ణయం తీసుకున్నారు. ప్రజాపాలన హామీల అమలు కోసం డిప్యూటీ సీఎం భట్టి(Deputy CM Bhatti) కేబినెట్‌ చైర్మన్‌గా సబ్‌ కమిటీని(sub-committee)ఏర్పాటు చేశారు.

ఆరు గ్యాంటీల(six guarantees)ను పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు 100 రోజుల్లో ఈ టాస్క్ ను పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(cm revanth reddy) నిర్ణయం తీసుకున్నారు. ప్రజాపాలన హామీల అమలు కోసం డిప్యూటీ సీఎం భట్టి(Deputy CM Bhatti) కేబినెట్‌ చైర్మన్‌గా సబ్‌ కమిటీని(sub-committee)ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌ బాబు(Sridhar Babu), పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar), పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి(Ponguleti Srinivas Reddy) నియమించారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన(prajapalana)లో ప్రజల నుంచి వచ్చిన ధరఖాస్తులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరగా అర్హులను తేల్చే పనిలోపడింది. 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆరుగ్యారంటీల అమలుపై ప్రభుత్వం పూర్తి స్థాయి ఫోకస్ పెట్టింది. ఈ టాస్క్ ను పూర్తి చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి చైర్మన్‎గా మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలకు ఆరు గ్యారంటీలను చేరువ చేయడం, అర్హులకు పథకాలు అందించడం కోసం ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఆరు పథకాలు ప్రజలకు అందించే బాధ్యత సబ్ కమిటీదేనని సీఎం రేవంత్ ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలనలో కోటి 25లక్షల ధరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. డేటా ఎంట్రీ పూర్తి అవ్వగానే నిజమైన అర్హులను గుర్తిస్తామని అన్నారు. ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని.. కారు కూతలు కూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎవరెన్నీ విమర్శలు చేసినా 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

Updated On 8 Jan 2024 7:07 AM GMT
Ehatv

Ehatv

Next Story