సంక్రాంతికి పండుగ(Sankranti Festival)కి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో నాలుగు ప్రత్యేక రైళ్ల(special trains)ను నడపనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే రైల్వేశాఖ 32 స్పెషల్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే.

సంక్రాంతికి పండుగ(Sankranti Festival)కి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో నాలుగు ప్రత్యేక రైళ్ల(special trains)ను నడపనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే రైల్వేశాఖ 32 స్పెషల్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌ -కాకినాడ టౌన్‌(Secunderabad - Kakinada Town), హైదరాబాద్‌ డెక్కన్‌ – కాకినాడ టౌన్‌(Hyderabad Deccan – Kakinada Town) మధ్య నాలుగు రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ప్రత్యేక రైళ్లలో సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయని..వాటిని ప్రయాణికులు వినియోగించుకోవాలని విజయవాడ డివిజన్‌ పీఆర్‌వో(Vijayawada Division PRO) నుస్రత్‌ మండ్రుప్కర్‌(Nusrat Mandrupkar) తెలిపారు.

ఈ నెల 11న గురువారం రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌(Secunderabad – Kakinada Town) (07021) రైలు.. సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. ఇదే రైలు (07022) తిరుగు ప్రయాణంలో ఈ నెల 12న (శుక్రవారం) సాయంత్రం 5.40 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

హైదరాబాద్‌–కాకినాడ టౌన్‌(Hyderabad – Kakinada Town) (07023) రైలు ఈ నెల 12న ( శుక్రవారం) సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07024) ఈ నెల 13న (శనివారం) రాత్రి 10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌–కాకినాడ స్పెషల్ ట్రైన్(Secunderabad – Kakinada Special Train) (07271/07272) ఈనెల 12న రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చే రుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

విశాఖ–కర్నూలు ప్రత్యేక రైలు (Visakha-Kurnool Special Train) (08541/08542) ఈ నెల 10,11, 17, 18, 24, 25 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.35కు కర్నూల్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖకు చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌–తిరుపతి ప్రత్యేక రైలు( Secunderabad – Tirupati special train) (02764/02763) .. ఈ నెల 10, 11, 17,18 తేదీల్లో సాయంత్రం 6.40 కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు చేరుకుంటుంది.తిరుగుప్రయాణంలో సాయంత్రం 5.15కు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5.55 గం.కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌–బ్రహ్మపుర్–వికారాబాద్‌ స్పెషల్‌ ట్రైన్‌ (Secunderabad-Brahmapur-Vikarabad Special Train) (07089/07090) ఈ నెల 7, 8, 14, 15 తేదీల్లో రాత్రి 7.45కు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. వికారాబాద్‌–బ్రహ్మపుర్–సికింద్రాబాద్‌ (07091/07092) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు వికారాబాద్‌ నుంచి బయలుదేరనుంది.

అలాగే శ్రీకాకుళం–వికారాబాద్‌ ప్రత్యేక రైలు‌ (Srikakulam-Vikarabad special train (08547/08548) ఈ నెల 12, 13, 19, 20, 26, 27 తేదీ ల్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు వికారాబాద్‌కు చేరుకుంటుంది.

Updated On 4 Jan 2024 11:18 PM GMT
Ehatv

Ehatv

Next Story