దక్షిణ కొరియా(South Korea) ప్రజల వయసు(Age) తగ్గింది.. దాదాపు అయిదు కోట్ల మంది ప్రజల వయసు ఒక్కసారిగా రెండేళ్లు తగ్గింది. ఇందుకోసం వారేమీ అమృతం గట్రాలు తాగలేదు. వయసు తగ్గించే మాత్రలు వేసుకోలేదు. వయసు దానంతట అదే తగ్గింది. అందుకు కారణం దక్షిణ కొరియా ప్రభుత్వం(South Korea Government) తీసుకున్న నిర్ణయం. ఇప్పటి వరకు దక్షిణ కొరియా ప్రజల వయసు విషయంలో గందరగోళం ఉండింది. వయసు లెక్కల్లో గజిబిజి ఉండింది.. ఇప్పుడు ప్రభుత్వం వాటిని సరి చేసే పనిలో పడింది..

దక్షిణ కొరియా(South Korea) ప్రజల వయసు(Age) తగ్గింది.. దాదాపు అయిదు కోట్ల మంది ప్రజల వయసు ఒక్కసారిగా రెండేళ్లు తగ్గింది. ఇందుకోసం వారేమీ అమృతం గట్రాలు తాగలేదు. వయసు తగ్గించే మాత్రలు వేసుకోలేదు. వయసు దానంతట అదే తగ్గింది. అందుకు కారణం దక్షిణ కొరియా ప్రభుత్వం(South Korea Government) తీసుకున్న నిర్ణయం. ఇప్పటి వరకు దక్షిణ కొరియా ప్రజల వయసు విషయంలో గందరగోళం ఉండింది. వయసు లెక్కల్లో గజిబిజి ఉండింది.. ఇప్పుడు ప్రభుత్వం వాటిని సరి చేసే పనిలో పడింది.. సాధారణంగా వయసును ఎలా లెక్కిస్తారు? ఏ తేదీనైతే పుట్టారో ఆ రోజు నుంచి మొదలు పెట్టి వచ్చే ఏడాది అదే తేదీకి ఏడాది పూర్తయినట్టుగా లెక్కిస్తాము.

అంటే పుట్టిన రోజుల ఆధారంగానే వయసు చెబుతుంటాం. కానీ దక్షిణ కొరియాలో మాత్రం ఇలా ఉండదు. అక్కడ మూడు విధాలుగా వయసును లెక్కిస్తారు. మొదటిది అంతర్జాతీయ విధానం. రెండోది కొరియన్‌ వయసు(Korean Age). మూడోది క్యాలెండర్‌ వయసు(Calender Age). ఇలా ఒక్కో వ్యక్తి మూడు రకాల వయసులను చెబుతుంటారు. మనకు కూడా కాసింత గందరగోళంగా ఉంది కదూ! డిటైల్డ్‌గా తెలుసుకుందాం! అంతర్జాతీయ విధానంలో శిశువు పుట్టినప్పుడు వారి వయసు సున్నా నుంచి మొదలవుతుంది. సపోజ్‌ ఇవాళ పుట్టిన శిశువు వయసు వచ్చే ఏడాది ఇదే రోజుకు ఏడాది పూర్తవుతుంది. ఇలాగే మనమూ లెక్కేస్తాం.

మనమే కాదు, ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఇదే విధానాన్ని పాటిస్తున్నాయి. కొరియన్‌ విధానంలో మాత్రం శిశువు పుట్టగానే ఒక ఏడాది వయసు వచ్చేసినట్టుగా భావిస్తారు. తర్వాత ప్రతి జనవరి ఫస్ట్‌కు ఒక్కో ఏడాది జోడిస్తారు. క్యాలెండర్‌ విధానం ఇంకా చిత్రంగా ఉంటుంది. ఈ విధానంలో శిశువు పుట్టినప్పుడు వయసు సున్నాగానే ఉంటుంది. తర్వాత ప్రతి జనవరి 1వ తేదీన మరో సంవత్సర కలుపుతారు. ఫర్‌ ఎగ్జాంపుల్‌ దక్షిణ కొరియాకు చెందిన ఓ వ్యక్తి డిసెంబర్‌ 31న పుట్టాడే అనుకుందాం! జనవరి 1 నాటికి అతడి వయసు రెండేళ్లు అవుతుంది. క్యాలెండర్‌ ప్రకారం ఏడాదిలో ఎప్పుడు పుట్టినా.. జనవరి 1 నుంచే అతడి వయసు లెక్కింపులోకి వస్తుంది.

ఇలా దక్షిణ కొరియా ప్రజలు ఒక్కో సమయంలో ఒక్కో వయసు చెబుతున్నారు. ఇదే గందరగోళానికి, వివాదానికి కారణమవుతోంది. చట్టపరమైన, అధికారిక విషయాల్లో అంతర్జాతీయ విధానంలోని వయసును చెబుతుంటే, నిర్బంధ సైనిక శిక్షణ వంటి వాటికి క్యాలెండర్ వయసు చెబుతున్నారు. ఇన్సూరెన్సు పాలసీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మరో వయసు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులకు పెద్ద చిక్కోచ్చి పడుతోంది. ఈ గందరగోళానికి తెరదించడానికి అక్కడి పార్లమెంట్‌(Parliament) జూన్‌ 28 నుంచి శిశువు పుట్టిన తేదీనే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయానికి మూడోవంతు పౌరులు మద్దతు లభించిందట!

Updated On 29 Jun 2023 12:11 AM GMT
Ehatv

Ehatv

Next Story