హైదరాబాద్ ఉప్పల్ లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ బస్టాండ్ లో బస్సు కోసం ఎదురు చూస్తున్న బాలికకు మాయమాటలు చెప్పిన ఓ వృద్ధుడు..ఆమెను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ ఉప్పల్ లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ బస్టాండ్ లో బస్సు కోసం ఎదురు చూస్తున్న బాలికకు మాయమాటలు చెప్పిన ఓ వృద్ధుడు..ఆమెను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్(Uppal)కు చెందిన పదహారేళ్ల బాలిక(sixteen year old girl) స్థానికంగా ఓ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఈనెల 3న ఉప్పల్ బస్టాపులో బస్సు కోసం ఎదురు చూస్తున్న బాలికను గమనించిన 60 ఏళ్ల వృద్ధుడు..తెలిసిన వాడిలా మాట్లాడాడు. మీ అమ్మనాన్నలు తనకు తెలుసంటూ బాలికను నమ్మించిన సదరు వ్యక్తి.. ఇంటికి వెళ్దామంటూ బస్టాప్ నుంచి బయటకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి దగ్గలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలికను అక్కడే వదిలేసి పారిపోయాడు. బాలిక ఇంటికి ఆలస్యంగా రావడంతో పాటు ఇంట్లో కూడా ముభావంగా ఉండటంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. బాలికను గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం తల్లికి చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. ఈ నెల 3న జరిగిన ఈ ఘటన ఆలోస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి పాతబస్తీ(old city) కి చెందిన షేక్ సాదక్(Shaikh Sadak) గా పోలీసులు గుర్తించారు. సాధక్ ఉప్పల్ బస్టాండు ప్రాంతంలోని ఓ కట్టెల మిషన్‌లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత సమాజంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ఎక్కడో ఓ చోట ఆడ పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కన్నుమిన్నూ కానక కొందరు కామాంధులు రెచ్చిపోతన్నారడానికి ఈ ఘటనే తాజా ఉదాహరణ.. ఏది ఏమైనా స్కూలుకు వెళ్లే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని.. తెలియని వ్యక్తుల వెంట వెళ్లటం కరెక్ట్ కాదని పోలీసులు చెబుతున్నారు. ఎదైనా అనుమానం ఉంటే..వెంటనే సమాచారం ఇవ్వాలని లేదంటే డయల్ 100కు కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.