వరుస గుండెపోటులతో సంభవిస్తున్న మరణాలు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్నాయి . 20 ఏళ్ల నుండి 30 ఏళ్ళ వయస్సు వారికి కూడా గుండెపోటు రావటం సర్వత్రా ఆందోళనగా మారింది. వైద్యులు సైతం సరైన కారణాలు ఇవి అని నిర్దారించలేని పరిస్థితి . తాజాగా మరో యువకుడు అతి చిన్నవయసులో గుండెపోటుకి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది . కరేబియాన్ దీవుల్లో తెలంగాణకు చెందిన2 0 సంవత్సరాల వైద్య విద్యార్థి ఏప్రిల్ 18 న గుండెపోటుతో హఠాన్మరణం పొందాడు .

వరుస గుండెపోటులతో సంభవిస్తున్న మరణాలు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్నాయి . 20 ఏళ్ల నుండి 30 ఏళ్ళ వయస్సు వారికి కూడా గుండెపోటు రావటం సర్వత్రా ఆందోళనగా మారింది. వైద్యులు సైతం సరైన కారణాలు ఇవి అని నిర్దారించలేని పరిస్థితి . తాజాగా మరో యువకుడు అతి చిన్నవయసులో గుండెపోటుకి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది . కరేబియాన్ దీవుల్లో (Caribbean devas)తెలంగాణకు చెందిన2 0 సంవత్సరాల వైద్య విద్యార్థి ఏప్రిల్ 18 న గుండెపోటుతో హఠాన్మరణం పొందాడు .

ఖమ్మం (Khammam)జిల్లా కు చెందిన ట్రాఫిక్ ఎస్సై టి .రవికుమార్ (T.ravi kumar)పెద్ద కుమారుడు హేమంత్ శివరామ కృష్ణ (Hemanth Sivaram krishna)(20)అమెరికాలోని బార్బొడాస్ లో 2021 లో వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్ళాడు . MBBS రెండో సంవత్సరం చదువుతున్న శివరామకృష్ణ ఇటీవల విహారయాత్రకు కరేబియన్ దీవులకు స్నేహితులతో వెళ్ళాడు . బీచ్ లో శివరామకృష్ణ ఈతకు వెళ్లి వచ్చాడు .వచ్చిన తరువాత స్నేహితులతో నవ్వుతు మాట్లాడుతూ ఉన్నటుండి కుప్పకూలిపోయాడు . హుటాహుటిన ఆసుపత్రికి కి తరలించిన ప్రయోజనం లేకపోయింది . గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు . విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు . విదేశాలకు వెళ్లిన కుమారుడుని డాక్టర్ గా చూడాలనుకున్న ఆ తల్లితండ్రులు విగతజీవిగా తిరిగి వస్తునందుకు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు .

Updated On 19 April 2023 12:39 AM GMT
rj sanju

rj sanju

Next Story